Viral Video: డాల్ఫిన్‌లతో సర్ఫింగ్.. అదరగొట్టాడుగా..! నెట్టింట ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో
సముద్రంలో జీవించే డాల్ఫిన్లు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎంతో యాక్టివ్‌గా నీటిలో ఎగురుతూ ఉంటాయి. అలాంటి డాల్ఫిన్లు ఒక్కోసారి సముద్రంలో సర్ఫింగ్ చేసేవాళ్లు, బోట్లలో వేటకు వెళ్లేవారిపైన దాడి చేస్తుంటాయి. ఏమైనా సముద్ర జీవులతో స్నేహం ప్రమాదరకమే. అయినా ఓ వ్యక్తి ఏకంగా డాల్ఫిన్లతో స్నేహం...

సముద్రంలో జీవించే డాల్ఫిన్లు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎంతో యాక్టివ్‌గా నీటిలో ఎగురుతూ ఉంటాయి. అలాంటి డాల్ఫిన్లు ఒక్కోసారి సముద్రంలో సర్ఫింగ్ చేసేవాళ్లు, బోట్లలో వేటకు వెళ్లేవారిపైన దాడి చేస్తుంటాయి. ఏమైనా సముద్ర జీవులతో స్నేహం ప్రమాదరకమే. అయినా ఓ వ్యక్తి ఏకంగా డాల్ఫిన్లతో స్నేహం చేయడమే కాదు.. వాటిపై సర్ఫింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి స్విమ్మింగ్ ఫూల్‌లో ఈదుతున్న రెండు డాల్ఫిన్ల తలలపై నిలబడ్డాడు. ఆ రెండు డాల్ఫిన్లు ఒకే వేగంతో ప్రయాణిస్తూ అతడిని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ వ్యక్తి అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు డాల్ఫిన్లతో ఒకేసారి సర్ఫింగ్ చేశాడు. ఆ వ్యక్తి ఓ ప్రొఫెషనల్ ట్రైనర్ అయి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. దీనిని మ్యాజిక్ స్టంట్ అని కొందరు అభివర్ణించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షల మందికి పైగా వీక్షించారు. 80 వేల మందికి పైగా లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
వీడియో చూడండి:
View this post on Instagram