Green Apple: ఆకుపచ్చ యాపిల్ తింటే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? అలాంటి సమస్యలున్న వారికి వరం!
ఇవి ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, కొలన్ క్యాన్సర్స్‌ని దూరం చేస్తాయి. ముఖ్యంగా గ్రీన్ ఆపిల్స్‌లోని పీల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి లివర్, కొలన్ క్యాన్సర్ సెల్స్‌ని తగ్గిస్తాయి. గ్రీన్ యాపిల్స్ లో ఉండే పీచు ఎక్కువగా తిన్న భావనను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్ రసం ఉబ్బసం వచ్చే వారికి మంచి రెమిడీ.

గ్రీన్ యాపిల్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను నియంత్రిస్తుంది, జీవక్రియను పెంచుతుంది. దీని చర్మంలో చాలా ఫైబర్ ఉంటుంది. పేగులు, జీర్ణవ్యవస్థ శుభ్రం చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. జింక్ – రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎముకలను ఇది ఆరోగ్యంగా బలపరుస్తుంది. చర్మ క్యాన్సర్‌ను నివారిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా నియంత్రిస్తుంది.
గ్రీన్ యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. గ్రీన్ యాపిల్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గ్రీన్ ఆపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, కొలన్ క్యాన్సర్స్‌ని దూరం చేస్తాయి. ముఖ్యంగా గ్రీన్ ఆపిల్స్‌లోని పీల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి లివర్, కొలన్ క్యాన్సర్ సెల్స్‌ని తగ్గిస్తాయి. గ్రీన్ యాపిల్స్ లో ఉండే పీచు ఎక్కువగా తిన్న భావనను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్ రసం ఉబ్బసం వచ్చే వారికి మంచి రెమిడీ.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..