Purple Cabbage: పోషక ఖజానా పర్పుల్ క్యాబేజీ..పవర్ ఫుల్ ప్రయోజనాలు తెలిస్తే..
పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కళ్ళ ఆరోగ్యానికి పర్పుల్ క్యాబేజీ చాలా మంచిది. కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా, కంటిశుక్లం రాకుండా కూడా ఇది సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ప్రతి సీజన్‌లో వచ్చే ప్రత్యేక కూరగాయలలో క్యాబేజీ ఒకటి. ఇది ఆరోగ్యానికి ఔషధ నిధిలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, దాదాపు అందరూ ఆకుపచ్చ క్యాబేజీని ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ, చాలా తక్కువ మందికి మాత్రమే ఊదా రంగు క్యాబేజీ, దాని ఉపయోగాల గురించి తెలిసి ఉంటుంది. కానీ, ఇందులో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు తగ్గడం నుండి ఆర్థరైటిస్, అల్సర్ల వరకు సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గించడానికి ఇది తినడం మంచిది. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్, మెగ్నీషియం వంటివి పర్పుల్ క్యాబేజీలో ఉంటాయి. పోషకాలు నిండిన పర్పుల్ క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను తగ్గిస్తుంది.
పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ సి, కె, కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కళ్ళ ఆరోగ్యానికి పర్పుల్ క్యాబేజీ చాలా మంచిది. కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా, కంటిశుక్లం రాకుండా కూడా ఇది సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..