గంజి నీళ్లు పారబోస్తున్నారా..? ఇలా వాడితే ఒత్తైన జుట్టు మీ సొంతం..! ట్రై చేయండి..
గంజి అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు చిక్కులు పడకుండా మృదువుగా ఉండేందుకు రైస్ వాటర్ ఉపయోగపడుతుంది. జుట్టు మృదువుగా మారడంతో ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. రైస్ మీ జుట్టుకు కండీషనర్‌లా కూడా పనిచేస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యాన్ని కాపాడి మృదువుగా మారుస్తుంది.

అన్నం వండిన తరువాత వచ్చే గంజితో అనేక లాభాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రైస్ వాటర్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గంజిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ రైస్ వాటర్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. గంజి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. గంజి నీళ్లు స్కాల్ప్‌పై ఉండే మలినాలను తొలగించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా రైస్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తుంది. నల్లని నిగారించే జుట్టు కోసం తరుచూ గంజిని అప్లై చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
బియ్యం నీళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తలపై దురద, డ్రై స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి. దీంట్లో విటమిన్లుంటాయి. ఇవి జుట్టును మాయిశ్చరైజ్ చేస్తాయి. సిల్కీగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి. మాడు దురదతో పాటూ చుండ్రు కూడా తగ్గిస్తుంది. సీబమ్ ఉత్పత్తిని నియంత్రించి మాడు పొడిబారకుండా మరీ జిడ్డుగా కాకుండా చేస్తుంది. బియ్యం నీళ్లలో ఉండే స్టార్చ్ వల్ల పేల సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైస్ వాటర్‌లో ఉండే ఇనాసిటోల్ జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా తయారు చేస్తుంది. గంజి నీళ్లు జుట్టులో తేమ పోకుండా చూసుకుంటాయి. గంజి అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు చిక్కులు పడకుండా మృదువుగా ఉండేందుకు రైస్ వాటర్ ఉపయోగపడుతుంది. జుట్టు మృదువుగా మారడంతో ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. రైస్ మీ జుట్టుకు కండీషనర్‌లా కూడా పనిచేస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యాన్ని కాపాడి మృదువుగా మారుస్తుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..