బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న రచ్చ.. సీఎం వర్సెస్ గవర్నర్‌లా మారిన వ్యవహారం
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటకలో పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే అంటూ అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే... లేటెస్ట్‌గా రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రకటన పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వివరాలు

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటకలో పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే అంటూ అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే… లేటెస్ట్‌గా రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రకటన పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం వర్సెస్ గవర్నర్‌లా మారిందీ వివాదం. సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం మేరకే గవర్నర్ ఆర్సీబీ సన్మానసభకు వెళ్లారని రాజ్‌భవన్ నుంచి ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని… ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్‌కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు తెలిపారు.
ఇటు సీఎం సిద్ధరామయ్య మాత్రం ఆర్సీబీ సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కానేకాదని చెబుతూ వస్తున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం వెల్లడించారు. క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఈవెంట్‌కి వెళ్లానన్నారు సీఎం. గవర్నర్‌ను సైతం క్రికెట్ సంఘమే ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు… పోలీసులు కూడా కార్యక్రమ నిర్వహణకు అంగీకారం తెలపడంతోనే తానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. మొత్తంగా… ప్రభుత్వం కార్యక్రమం కాదని అటు ముఖ్యమంత్రి… ముమ్మటానికి ప్రభుత్వ నిర్ణయమేనని ఇటు రాజ్‌భవన్ వర్గాల వరుస ప్రకటనలు రచ్చ లేపుతున్నాయి. మరీ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో…! విచారణలో ఏం తేలుతుందో చూడాలి.