APPSC Group 1 Merit List 2025: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్‌లిస్ట్ వచ్చేసింది.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
APPSC Group 1 Mains Result 2025 Out: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జూన్ 10) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్‌లిస్ట్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది..

అమరావతి, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జూన్ 10) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్‌లిస్ట్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను మే 3 నుంచి 9వ తేదీ వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జరిగిన కేవలం నెలరోజుల్లోనే ఏపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025 మెరిట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీపీఎస్సీ మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్షను అదే ఏడాది మార్చి 17వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 91,463 మంది అంటే దాదాపు 72.55 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మెయిన్స్ పరీక్షకు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరందరికీ ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిపారు. తాజాగా విడుదలైన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 182 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
ఈ క్రమంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీలను కూడా విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నట్లు పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.