Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల నేడే.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో..

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2025 జూన్‌) పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు బుధవారం (జూన్‌ 11) విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్‌ టికెట్లు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌..

TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల నేడే.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో..
Telangana TET Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2025 | 7:22 AM

హైదరాబాద్‌, జూన్‌ 11: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2025 జూన్‌) పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు బుధవారం (జూన్‌ 11) విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్‌ టికెట్లు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్‌ 18 నుంచి 30 వరకు జరగనున్నాయి. కాగా ఈసారి టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకు కలిపి దాదాపు 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పేపర్‌ 1కు 46 వేలు, పేపర్‌ 2కు 1.03 లక్షలు, రెండు పేపర్లకు కలిపి 16 వేలకుపైగా దరఖాస్తు వచ్చాయి.

తెలంగా లా సెట్‌ 2025 ఫలితాల తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రలో నిర్వహించిన లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025 ఫలితాల తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని జూన్‌ 10న విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఫలితాలను జూన్‌ 25న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించింది. కాగా జూన్‌ 6న టీజీ ఎల్‌సెట్‌ అండ్‌ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు జరగగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45,609 మంది పరీక్ష రాశారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది హాజరయ్యారు.

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 ప్రాథమిక కీ విడుదల… అభ్యంతరాలకు 13 వరకు ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025 ప్రాథమిక ఆన్సర్‌ కీని ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) తాజాగా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కీతో పాటు రెస్పాన్స్‌షీట్స్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రంను కూడా విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను జూన్‌ 13వ తేదీలోపు తెలపాలని వివరించింది. ఇకజూన్‌ 21న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ప్రవేశ పరీక్ష జూన్‌ 5న నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.