TS Eamcet Answer Key 2023: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. మే 16 వరకు అభ్యంతరాల స్వీకరణ
ఇంజినీరింగ్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ప్రాథమిక కీని సోమవారం రాత్రి 8గంటలకు విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ 'కీ' డౌన్‌లోడ్..

తెలంగాణ ఎంసెట్-2023 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ సోమవారం (మే 15) విడుదలైంది. ఇంజినీరింగ్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ప్రాథమిక కీని సోమవారం రాత్రి 8గంటలకు విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ ‘కీ’ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో 104, ఏపీలో 33తో కలిపి మొత్తం 137 పరీక్షా కేంద్రాల్లో 3.20 లక్షల మంది (అగ్రికల్చర్ & ఇంజనీరింగ్) విద్యార్థులు ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, 12, 13, 14 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్ల చొప్పున ఇంజనీరింగ్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,351 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,95,275 మంది (94.11శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించిరు. అగ్రికల్చర్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ మే 14న విడుదలైన సంగతి తెలిసిందే.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలు లేవనెత్తేందుకు రెస్పాన్స్ పత్రాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ప్రాథమిక కీపై మే 17 రాత్రి 8గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్ విధానంలో పంపాలని అధికారులు సూచించారు. ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక కీ పై16వ తేదీ వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు.




తెలంగాణ ఎంసెట్-2023 ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యంతరాలు తెలిపే లింక్ కోసం క్లిక్ చేయండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




