AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TIFR Recruitment 2023: నెలకు రూ.89,900 జీతంతో.. టాటా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

ముంబాయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌).. 19 సైంటిఫిక్‌ ఆఫీసర్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌, వర్క్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

TIFR Recruitment 2023: నెలకు రూ.89,900 జీతంతో.. టాటా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు
TIFR Mumbai
Srilakshmi C
|

Updated on: May 24, 2023 | 2:01 PM

Share

ముంబాయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌).. 19 సైంటిఫిక్‌ ఆఫీసర్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌, వర్క్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎస్‌ఎస్‌సీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో జూన్‌ 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.22,000ల నుంచి రూ.89,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

Administrative Officer (D), Recruitment Cell, Tata Institute of Fundamental Research, 1, Homi Bhabha Road, Navy Nagar, Colaba, Mumbai 400005.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.