ECIL Hyderabad Jobs 2023: పరీక్ష లేదు.. డిగ్రీ అర్హత.. హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 2.4 లక్షల జీతంతో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్).. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి..

భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్).. 11 సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్పొరేట్ పర్ఛేజ్, హెచ్‌ఆర్, లా, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ సీఏ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 10, 2023వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా జూన్ 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు పంపించాలి. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
Deputy General Manager Human Resources (Recruitment Section), Administrative Building, Corporate Office, Electronics Corporation of India Limited, ECIL (Post), Hyderabad – 500 062, Telangana.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




