Mistakes in TGPSC Group 1 Key: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో 5 తప్పులు.. మెయిన్స్‌ అర్హుల సంఖ్య పెంపు

తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం (జులై 7) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీ ని కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ కీలో కొన్ని తప్పులు దొర్లాయని గ్రూప్‌-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో వచ్చిన ఈ తప్పులను సరిచేయకుండా.. వాటిని టీజీపీఎస్సీ అధికారులు..

Mistakes in TGPSC Group 1 Key: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో 5 తప్పులు.. మెయిన్స్‌ అర్హుల సంఖ్య పెంపు
TGPSC Group 1 Key
Follow us

|

Updated on: Jul 08, 2024 | 6:25 AM

హైదరాబాద్‌, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం (జులై 7) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీ ని కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ కీలో కొన్ని తప్పులు దొర్లాయని గ్రూప్‌-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో వచ్చిన ఈ తప్పులను సరిచేయకుండా.. వాటిని టీజీపీఎస్సీ అధికారులు అలాగే ఇచ్చినట్లు అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఐదు తప్పులు దొర్లాయని, వాటిని టీజీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదని దేవేందర్‌, రాకేశ్‌ తదితర గ్రూప్‌ 1 అభ్యర్ధులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే కమిషన్‌ ఫైనల్‌ కీలో 2 ప్రశ్నల తొలగించింది. మరో ప్రశ్నకు రెండు ఆప్షన్లు కూడా కరెక్టుగా ఉండటంతో పరిగణనలోకి తీసుకున్నామని చెప్పింది.

కాగా రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్‌ 9న 31 జిల్లాల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. దీని ప్రకారం మొత్తం 28,150 మందికే మెయిన్స్‌ రాసే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి షార్ట్‌ఫాల్‌ విధానం అమలు చేయడంతో మెయిన్స్‌కు హాజరయ్యేవారి సంఖ్య 31,382 మందికి పెరిగింది. అదనంగా 3,232 మందిని ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్‌ మార్కుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్‌ 1 మెయిన్ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, గతంలో ప్రకటించిన విధంగానే మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మెయిన్స్‌ పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది.

ఏమిటీ షార్ట్‌ఫాల్‌ విధానం..?

గ్రూప్‌-1లో ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు షార్ట్‌ఫాల్‌ విధానాన్ని టీజీపీఎస్సీ ఈసారి కొత్తగా అమలు చేసింది. తొలుత చెప్పిన విధంగా 1:50 చొప్పున 563 పోస్టులకు మెరిట్‌ జాబితాలో 28,150 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్‌కు ఎంపిక కావల్సి ఉంటుంది. అయితే మెరిట్‌ జాబితా ప్రకారం కమ్యూనిటీ రిజర్వేషన్‌ పోస్టుల్లో 1:50 నిష్పత్తికి తక్కువగా ఉంటే అదనంగా అదే కమ్యూనిటీ నుంచి ఎంపిక చేసే విధానానే షార్ట్‌ఫాల్‌ అంటారు. ఎస్సీ క్యాటగిరీలో 70 పోస్టులుంటే.. వారందరినీ 1:50 నిష్ప త్తి ప్రకారం లెక్కిస్తారు. తద్వారా 3,500 మంది ఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసి, మెయిన్స్‌కు రాసేందుకు అర్హత కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం