TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం.. 1:100 నిష్పత్తిలో ఎంపిక ఇక లేనట్లే
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని అభ్యర్ధులు ఓవైపు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేసింది..
హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని అభ్యర్ధులు ఓవైపు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేసింది. అయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణకు 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రేవంత్ సర్కార్ దృష్టిసారించిన దాఖలాలు లేవు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా.. 32 వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్షలను జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
కాళోజీ వర్సిటీ ఎండీఎస్ కన్వీనర్ కోటా భర్తీకి వెబ్ ఆప్షన్స్
తెలంగాణ రాష్ట్రంలోని ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మొదటి విడత వెబ్ ఆప్షన్స్ ఆగస్టు13న మధ్యాహ్నం 3 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 వరకు నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఎస్‌ఎస్‌సీ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తేదీలు వెల్లడి.. త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ
దేశ వ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తోన్న మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) పరీక్షల 2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. ఇందుకు సంబంధించి త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఎంటీఎస్ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.