AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance scholarship: విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. రూ. 6 లక్షల స్కాలర్ షిప్

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో యువ శక్తికి అండగా నిలిచి, వారి ప్రతిభకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్ షిప్స్ కు...

Reliance scholarship: విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. రూ. 6 లక్షల స్కాలర్ షిప్
Reliance Foundation
Narender Vaitla
|

Updated on: Aug 14, 2024 | 4:45 PM

Share

దేశంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ప్రతీ ఏటా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ అందిస్తోన్న విషయం తెలిసిందే. వేలాది మంది విద్యార్థుల పై చదువులకు అయ్యే ఖర్చును ఈ సంస్థ భరిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. 2024-25 ఏడాదికి గాను స్కాలర్ షిప్స్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈ ఏడాది ప్రతిభావంతులైన 5100 మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందించనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీ విద్యార్థులకు ఈ అవకాశం సదావకాశం కల్పించారు.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో యువ శక్తికి అండగా నిలిచి, వారి ప్రతిభకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్ షిప్స్ కు విద్యార్థుల అకాడమిక్స్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డిగ్రీ చదువుకునే విద్యార్థులకు రూ. 2 లక్షలు, పీజీ చదివే విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఉపకార వేతనాన్ని అందిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు www.scholarships.reliancefoundation.org. ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో విద్యార్థులు చూపిన అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 6వ తేదీ, 2024ని చివరి తేదీగా నిర్ణయించారు. 2022 నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా నీత అంబాని ఈ ప్రకటన చేశారు.

10 ఏళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్స్ అందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో నీత అంబానీ తెలిపారు. ఆరోజు నుంచి నేటి వరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతీ ఏటా సుమారు 5100 మందికి స్కాలర్షిప్స్ ఇస్తూ వస్తోంది. భారతదేశంలో ఎక్కువ మందికి స్కాలర్షిప్స్ అందిస్తున్న ఏకైక ప్రైవేట్ సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 23 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..