తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. TG EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. పూర్తి వివరాలివే..
TG EAPCET 2025 Applications: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET-2025) దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది.. వాస్తవానికి ఈరోజు (ఫిబ్రవరి 25) నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది..

TG EAPCET 2025 Applications: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET-2025) దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది.. వాస్తవానికి ఈరోజు (ఫిబ్రవరి 25) నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.. ఈ క్రమంలోనే సాంకేతిక కారణాలతో దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ మంగళవారం ప్రకటించారు. తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన TG EAPCET ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడిందని.. మార్చి 1 నుంచి అప్లికేషన్స్ తీసుకోనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటనలో తెలిపింది.. ఇక ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తుల నేపథ్యంలో విద్యార్థుల సందేహాల నివృత్తికి జేఎన్టీయూ రెండు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు వివరాల కోసం 74169 23578, 74169 08215 ఈ నంబర్లను సంప్రదించవచ్చని ఎప్‌ఎట్ కన్వీనర్ వెల్లడించారు. ఇంటర్ పూర్తై ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET పరీక్షను విద్యార్థులు రాయనున్నారు
EAPCET షెడ్యుల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల : 20-02-2025
అప్లికేషన్ల స్వీకరణ : మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు అప్లికేషన్స్ స్వీకరణ
అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 29,30
ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 2, 3, 4, 5
జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగే EAPCET పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదల అయింది. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు EAPCET కన్వీనర్ తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..




