TG EAPCET Seat Allotment: ఈఏపీసెట్‌ రెండో దశ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి.. తుది విడత కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచంటే

తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తికాగా.. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు కూడా సీట్లను కేటాయించారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్ధుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సీట్లు పొందిన అభ్యర్థులు లాగిన్‌లో సైన్-ఇన్ ద్వారా అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

TG EAPCET Seat Allotment: ఈఏపీసెట్‌ రెండో దశ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి.. తుది విడత కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచంటే
TG EAPCET 2024 Final Phase Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 01, 2024 | 3:43 PM

హైదరాబాద్‌, ఆగస్టు 1: తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తికాగా.. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు కూడా సీట్లను కేటాయించారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్ధుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సీట్లు పొందిన అభ్యర్థులు లాగిన్‌లో సైన్-ఇన్ ద్వారా అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకోవాలంటే.. తమ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

షెడ్యూల్‌ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1, 2 తేదీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. తుది దశ ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 13వ తేదీన మూడో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 10 న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. ఆగస్టు 13 తాత్కాలికంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇక అదే రోజు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కూడా చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 13 నుంచి 15 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా స్వయంగా రిపోర్టింగ్ చేయాలి. ఆగస్టు 16 నుంచి 17 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఆగస్టు 17న కాలేజీల వారీగా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ప్రకటిస్తారు. కాగా రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 86,509 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండు విడతల కౌన్సెలింగ్ లలో 81,490 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 5019 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిపోయిన సీట్లకు తుది విడతలో సీట్లు కేటాయిస్తారు.

తెలంగాణ ఈఏపీసెట్‌ సీట్‌ అలాట్‌మెంట్ ఆర్డర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

గిరిజన గురుకుల బాలికల కాలేజీలో ఆగస్టు 3, 4 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంలోని గిరిజన బాలికల జూనియర్‌ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశానికిగాను స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆగస్టు 3, 4 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ విమల ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో ఎస్టీ కేటగిరీలో 8, ఓసీ 1, బీసీ 1, పీహెచ్‌సీ 1, స్పోర్ట్స్‌ 1, బైపీసీలో గ్రూపులో ఎస్టీ 6, ఓసీ 1, పీహెచ్‌సీ 1, స్పోర్ట్స్‌ 1 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సీఈసీలో ఎస్టీ 13, ఓసీ 1, బీసీ 1, పీహెచ్‌సీ 1, స్పోర్ట్స్‌ 1, అర్బన్‌ 1, ఏటీ గ్రూపులో ఎస్టీ 1, ఎస్సీ 1, ఐఎం గ్రూపులో ఎస్టీ 8, ఓసీ 1, బీసీ 1, పీహెచ్‌సీ 1, ఫోర్స్‌ స్పోర్ట్స్‌ 1, అర్బన్‌ 1 చొప్పున మొత్తం 54 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలిపారు.

కౌన్సెలింగ్‌ తేదీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనవల్సి ఉంటుంది. అర్హత కలిగిన విద్యార్థినులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశాలు పొందాల్సిందవచ్చు. ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 90520 32704, 85001 78635 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.