Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIHM: విద్యార్థుల భవితకు ఐఐహెచ్‌ఎమ్‌ భరోసా.. ఇందులో విద్యనభ్యసించడానికి టాప్‌ 10 కారణాలు ఇవే

మారుతోన్న కాలంతో పాటు హోటల్ పరిశ్రమలో కూడా అనూహ్య మార్పులు వచ్చాయి. పెరుగుతోన్న టూరిజం కారణంగా హోటల్‌ పరిశ్రమలో అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హోటల్ మేనేజ్‌మెంట్స్‌లో బెస్ట్ కోర్సులు అందించే వాటిలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఒకటి...

IIHM: విద్యార్థుల భవితకు ఐఐహెచ్‌ఎమ్‌ భరోసా.. ఇందులో విద్యనభ్యసించడానికి టాప్‌ 10 కారణాలు ఇవే
IIHM
Follow us
Narender Vaitla

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 01, 2024 | 4:26 PM

మారుతోన్న కాలంతో పాటు హోటల్ పరిశ్రమలో కూడా అనూహ్య మార్పులు వచ్చాయి. పెరుగుతోన్న టూరిజం కారణంగా హోటల్‌ పరిశ్రమలో అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హోటల్ మేనేజ్‌మెంట్స్‌లో బెస్ట్ కోర్సులు అందించే వాటిలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఒకటి. కేవలం విద్యను అందించడమే కాకుండా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ సైతం అందిస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను  అందిస్తున్నారు. ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యార్థులు కచ్చితంగా విద్యనభ్యసించడానికి ఉన్న 10 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యనభ్యసించిన వారికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించనున్నారు. విదేశాల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థలతో గ్లోబల్‌ లెర్నింగ్ అవకాశాలను కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మీనీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌తో పాటు మరికొన్ని ఇతర దేశాలల్తో చదువుకోవచ్చు. విదేశాల్లో హోటల్‌ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

* ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యనభ్యసించడానికి మరో కారణం విదేశీ విద్యా సంస్థలతో ఉన్న ఒప్పందమే. ఐఐహెచ్‌ఎమ్‌ ప్రపంచంలోని 55 సంస్థలంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులను ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు సందర్శన ఉంటుంది.

* ప్రపంచంలోనే అతిపెద్ద యంగ్ చెఫ్‌ ఒలంపియాడ్‌ను ఐఐహెచ్‌ఎమ్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా గ్లోబల్‌ స్కూల్స్‌ ఔత్సాహిక చెఫ్స్‌ తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ కాంపిటీషన్‌లో విజేతలను ప్రకటించేందుకు కూడా విదేశాలకు చెందిన ప్రముఖ చెఫ్‌లను ఐఐహెచ్‌ఎమ్‌ ఆహ్వానిస్తుంటుంది. ఈ యంగ్‌ చెఫ్‌ ఒలంపియాడ్‌కు ప్రధాన న్యాయమూర్తిగా పద్మశ్రీ చెఫ్ సంజీవ్ కపూర్ వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ డేవిడ్ ఫోస్కెట్ OBE, సెలబ్రిటీ చెఫ్ బ్రియాన్ టర్నర్ CBE, మిచెలిన్ స్టార్డ్ చెఫ్ క్రిస్ గాల్విన్‌ లాంటి దిగ్గజ ప్రముఖులు పాల్గొంటారు.

* ఇక ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యనభ్యసించడానికి మరో ప్రధాన కారణం ఇక్కడి ఫ్యాకల్టీ. ఆయా రంగాల్లో నిపుణులైన వారితో బోధన అందించడం దీని ప్రత్యేకత. ఇటలీకి చెందిన ప్రముఖ చెఫ్‌ ఎన్జో ఆలివెరీ, యూకేకి చెందిన జాన్‌ వూడ్‌, క్రిస్‌ గాల్విన్‌ వంటి వారు ఐఐహెచ్‌ఎమ్‌ను సందర్శించి తమ గెస్ట్‌ లెక్చర్‌ను అందించారు. థియరీతో పాటు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ అందించడం ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకత.

* 55కి పైగా దేశాలకు చెందిన ప్రముఖ చెఫ్స్‌తో ఐఐఎమ్‌హెచ్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఇటలీకి చెందిన ప్రముఖ చెఫ్‌ ఎన్జో ఆలివెరీ, ఫ్రాన్స్‌కు చెందిన మగడల వంటి వారితో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తారు.

* ప్రతీ ఏడాది ఐఐహెచ్‌ఎమ్‌లో ఎడ్యుకేషనల్ టూర్స్‌ను సైతం నిర్వహిస్తుంటారు టీ టూర్‌, వైన్‌ టూర్‌, స్కాచ్‌ టూర్‌ పేరుతో టూర్‌లను నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో ఉచితంగా ఇలాంటి టూర్స్‌ నిర్వహిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇదే కావడం విశేషం. ఇందులో భాగంగా విద్యార్థులను స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు తీసుకెళ్తారు.

* ఇక ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యనభ్యసించే వారికి పలు అంతర్జాతీయ హోటల్స్‌లో ఇంటర్న్‌షిప్‌ నిర్వహించే అవకాశం కల్పిస్తారు. దీంతో విద్యార్థులకు అపారమైన ప్రాక్టికల నాలెడ్జ్‌ లభిస్తుంది.

* యూరోపియన్‌ యూనియన్‌తో ఐఐహెచ్‌ఎమ్‌ స్కూడెంట్ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగా విద్యార్థులు స్వీడ్‌, ఫ్రాన్స్‌, టరకీ వటి దేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.

* ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారు. భారత్‌తో పాటు యూకే, మిడిల్‌ ఈస్ట్‌, సింగపూర్, మాల్దీవులు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. ఇలా మంచి స్థానంలో స్థిరపడిన వారితో ప్రతీ ఏటా ఒక సమావేశం నిర్వహిస్తారు. దీంతో చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహం అందించినట్లు అవుతుంది.

* ఐఐహెచ్‌ఎమ్‌లో విద్యనభ్యసించడానికి మరో ప్రధాన కారణం. ఇందులో చదువుకున్న వారు ఉద్యోగం చేయడానికి అన్ని రకాల ఫిట్‌గా మారుతారు. మేనేజ్‌మంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్ వంటి కోర్సులను అందిస్తారు. అలాగే మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐఐహెచ్‌ఎమ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా వారి కర్క్యూలమ్‌లో చేర్చారు.

ఐఐహెచ్ఎం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి..