AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘అదేమన్నా కుక్కపిల్ల అనుకున్నావా? ఒక్క సెకనులో నిన్ను నమిలేయగలదు’ రీల్స్ మోజులో యువతి పిచ్చిపని

సోషల్‌ మీడియాలో ఓవర్‌ నైట్‌ స్టార్లు కావడానికి కొందరు యువత చేసే వెర్రి వేషాలు చూసే వాళ్లకు చిర్రెత్తిస్తాయి. లైకులు, కామెంట్లు, వ్యూస్‌ కోసం మరీ ఇంత దిగజారాలా అనే సందేహం కూడా వస్తుంది. ఒక్కోసారి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ చేస్తూ.. ఏ కంగా మొసలి నోట్లోకి ఆహారం అవ్వబోయి.. తృటితో తప్పించుకుని బయటపడింది. ఇందుకు సంబంధించిన..

Viral Video: 'అదేమన్నా కుక్కపిల్ల అనుకున్నావా? ఒక్క సెకనులో నిన్ను నమిలేయగలదు' రీల్స్ మోజులో యువతి పిచ్చిపని
Woman Pets Alligator
Srilakshmi C
|

Updated on: Jul 31, 2024 | 9:01 PM

Share

సోషల్‌ మీడియాలో ఓవర్‌ నైట్‌ స్టార్లు కావడానికి కొందరు యువత చేసే వెర్రి వేషాలు చూసే వాళ్లకు చిర్రెత్తిస్తాయి. లైకులు, కామెంట్లు, వ్యూస్‌ కోసం మరీ ఇంత దిగజారాలా అనే సందేహం కూడా వస్తుంది. ఒక్కోసారి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ చేస్తూ.. ఏ కంగా మొసలి నోట్లోకి ఆహారం అవ్వబోయి.. తృటితో తప్పించుకుని బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి చేస్తున్న పిచ్చి పనులకు తిట్టిపోస్తున్నారు. మీరూ చూసేయండి..

అత్యంత ప్రమాదకరమైన మాంసాహారులలో మొసలి ఒకటి. ఎర కోసం ఎంత ఓపికగా ఎదురు చూస్తుంటో.. నోటికి దొరికిన ఆహారాన్ని దొరకబుచ్చుకోవడానికి సెకన్ల వ్యవధిలో దాడి చేస్తుంది. అలాంటి మొసలితో ఓ యువతి పరాచకాలు ఆడటం మొదలెట్టింది. ఈ వీడియోలో జీన్స్, షర్ట్, బీచ్ టోపీ ధరించిన ఓ యువతి నీళ్లలో ఉన్న ముసలికి అతి దగ్గరగా వచ్చి, కెమెరా వైపు చూస్తూ మాట్లాడటం కనిపిస్తుంది. అంతలో నీళ్లలో పైకి తలపెట్టి చూస్తున్న మొసలి అమాంతం గట్టున ఉన్న యువతి కాలును నోటికి కరచుకోబోతుంది. అయితే సదరు యువతి మాత్రం ఇదేం పట్టించుకోకుండా తన మానానా తాను వీడియోలో కోసం మాట్లాడుతూ.. తన చేతితో మొసలి తలపై నిమరడం కనిపిస్తుంది. మళ్లీ మరోసారి నోరు ఆబగా తెరచి యువతిపైకి మొసలి రావడంతో.. ఆమె తెలివిగా తనతో తెచ్చుకున్న మాంసం ముక్కను దాని నోట్లోకి విసురుతుంది. దాంతో అది మళ్లీ నీళ్లలోకి వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను జూన్ 19న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా ఏకంగా 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేనా లక్షల్లో కామెంట్లు, లైకులు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

‘కొంచెం అయితే మొసలికి ఆహారం అయ్యే దానికి.. మరీ అంత నిర్లక్ష్యం పనికిరాదు’ అంటూ ఓ యూజర్ హితవు పలకగా, ‘దయచేసి ఇలాంటి చోట్లకు వచ్చనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అది ఒక్క సెకనులో నిన్ను తినేయగలదు’ అంటూ మరొక యూజర్‌ జాగ్రత్తలు చెప్పాడు. ‘వన్య ప్రాణులు ఎల్లప్పుడూ ప్రమాదకరమైనవి, అవి స్నేహపూర్వకంగా ఉండవు’ అని మరొకరు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.