Watch: పిల్లి చేతిలో ఓడిన క్రీడాకారిణి..! వైరల్ అవుతున్న వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..

పిల్లి, అథ్లెట్ మధ్య రేసుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వీడియోను మొదలు నుండి చివరి వరకు మళ్లీ మళ్లీ చూస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. కామెంట్ సెక్షన్‌లో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Watch: పిల్లి చేతిలో ఓడిన క్రీడాకారిణి..! వైరల్ అవుతున్న వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..
Cat Defeats Marathon Runner
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 31, 2024 | 7:28 PM

మనిషికి, పిల్లికి మధ్య పోటీ జరిగితే ఎవరు గెలుస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాకపోతే వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీ ప్రశ్నకు సమాధానం కచ్చితంగా దొరుకుతుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, పిల్లి అకస్మాత్తుగా మారథాన్ రేసులోకి ప్రవేశించింది. ఇక ఆ పోటీ ఆఖరున అందరినీ షాక్‌కు గురిచేసే సంఘటన జరిగింది. ఈ వీడియో చైనాకు చెందిన బైహెలియాంగ్ హాఫ్ మారథాన్‌కి చెందినదిగా తెలిసింది. పిల్లికి, మనుషులకు మధ్య జరిగే పోటీకి సంబంధించిన ఈ వీడియోపై ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో రెండు పెద్ద ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 89 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. సోషల్ మీడియా మరో X ప్లాట్‌ఫారమ్‌లో 90 వేల కంటే ఎక్కువ సార్లు చూశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లి అకస్మాత్తుగా మారథాన్ రన్నర్ పక్కగా వచ్చింది. పిల్లికి మార్గం కనిపించనప్పుడు, అది రన్నర్‌తో కలిసి పరుగెత్తడం ప్రారంభిస్తుంది. అయితే చివరికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పిల్లి మారథాన్ రన్నర్‌కు 3 సెకన్ల ముందు టార్గెట్‌ లైన్‌ను దాటుతుంది. ప్రజలు ఈ వీడియోను చాలా ఫన్నీగా చూస్తున్నారు. కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియోపై వినియోగదారులు భారీగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చైనాలో మారథాన్ రేసులో పరిగెడుతున్న అథ్లెట్ వాంగ్ వాన్ఫు హాఫ్-మారథాన్ 21 కి.మీ పూర్తి చేయడానికి 1:08:36 సమయానికి ముగింపు రేఖను చేరుకున్నాడు. పిల్లి అతనితో పాటు కొన్ని మీటర్ల ముందు పరుగెత్తడం ప్రారంభిస్తుంది. అథ్లెట్ కంటే కేవలం 3 సెకన్ల ముందు పిల్లి ఆ లైన్‌ క్రాస్‌ చేస్తుంది.

కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు., పిల్లికి మెడల్ ఇవ్వాలంటూ చాలా మంది డిమాండ్‌ చేశారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు..ఈ పిల్లి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. మూడవ వినియోగదారు నిజమైన విజేత ఎవరో మాకు తెలుసు అని రాశారు. 10 మీటర్ల దూరం నుంచి పిల్లి పరుగు పరుగున వస్తోందని నాలుగో వినియోగదారు రాశారు. ఈ వీడియో Instagram, X ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా దూసుకుపోతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..