AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వేలిముద్రల ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు..! ఎలాగో తెల్సా

వేలిముద్రలు.. మన ఐడెంటిటీని చెప్పడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఆర్ధిక లావాదేవీలైనా, క్రైమ్ సంబంధిత అంశాలైనా కూడా ఒక నిర్దోషిని గానీ.. ఒక నేరస్థుడిని పట్టుకోవడంలో వీటినే ఆధారంగా చేసుకుంటారు నిపుణులు.

Viral: వేలిముద్రల ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు..! ఎలాగో తెల్సా
Viral Photo
Ravi Kiran
|

Updated on: Jul 31, 2024 | 7:30 PM

Share

వేలిముద్రలు.. మన ఐడెంటిటీని చెప్పడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఆర్ధిక లావాదేవీలైనా, క్రైమ్ సంబంధిత అంశాలైనా కూడా ఒక నిర్దోషిని గానీ.. ఒక నేరస్థుడిని పట్టుకోవడంలో వీటినే ఆధారంగా చేసుకుంటారు నిపుణులు. మరి అలాంటి వెలిముద్రలు మీ గురించి ఏ విషయాలు చెబుతాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా.? న్యూరోసైన్స్, జెనెటిక్స్, డెర్మటోగ్లిఫిక్స్, సైకాలజీ విభాగాల్లో జరిగిన కొన్ని పరిశోధనలు.. వేలిముద్రలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చునని తేలింది. వేలిముద్రలు అనేవి సాధారణంగా మూడు రకాలుగా విభజించబడ్డాయి. అవే లూప్స్, కర్వ్స్, వోర్ల్స్. ప్రతి రకం విభిన్న వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయని పరిశోధకుల అంచనా.

ఇది చదవండి: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది

శంఖు ఆకారం(లూప్స్)

ఈ ఆకారంతో వేలిముద్రలున్న వ్యక్తులు చాలా నెమ్మదస్తులు, అలాగే ప్రశాంతమైన స్వభావం కలిగినవారు. ఎప్పుడూ అందరికంటే వెనుక తాము ఉన్నామని ఆలోచించే వ్యక్తులు వీరట. మొదలుపెట్టే పని ఏదైనా కూడా వీరు కష్టపడుతూనే ప్రారంభిస్తారు. సానుభూతి వీరికున్న ఏకైక లక్షణం.. దీనితో స్నేహితులను సంపాదించుకుంటారు. నిజాయితీగా ఉన్నామంటూ డప్పుకొట్టుకుంటారు. ఎక్కువగా పగటికలలు, ఊహల్లో విహరిస్తుంటారు. వీరికి ఏ పనిలోనూ సంతృప్తి ఉండదు. ఎప్పుడూ బోర్ ఫీల్ అవుతుంటారు. అందుకే ఉద్యోగాలు కూడా ఎక్కువగా మారుతుంటారు.

వంపు గీతలు(కర్వ్స్)

ఈ ఆకారంతో వేలిముద్రలున్నవారు చాలా ధైర్యవంతులు.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం కలిగి ఉండటమే కాదు.. ప్రతీ పనిలోనూ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. స్ట్రాంగ్ పర్సన్స్ కూడా వీరు. ఒక పని విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవ్వరూ కూడా వీరిని దాని నుంచి తప్పించడం కష్టం. ఆచరించే నమ్మకాలైనా, స్నేహితులైనా.. అన్నింటా నిజాయితీగా ఉంటారు. సోమరితనం వీరికి ఉండదు. మారుతున్న ప్రపంచంతో వీరు ఎక్కువగా మారారు.

వృత్తాకారం(వోర్ల్స్)

ఈ ఆకారంతో వేలిముద్రలు ఉన్నవారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువగా రిజర్వ్డ్‌గా ఉండటమే కాదు.. వారికి నచ్చినట్టుగా పనులు చేయడానికి ఇష్టపడతారు. స్వార్ధంతో పాటు కొంచెం స్వతంత్ర భావాలు.. అలాగే మనసులోని విషయాలను ఇతరులతో పంచుకోవడం లాంటివి వీరిలోని కొన్ని లక్షణాలు. వీరికున్న తెలివి, ప్రతిభ, అలాగే క్రియేటివ్ థాట్స్ విజయం వైపు వెళ్లేలా చేస్తాయి. చుట్టూ ఉండే పరిస్థితులను తమ విజయానికి వినియోగించుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

ఇది చదవండి: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా

Follow Us
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్