బాలయ్యకు 70.. నానికి 60 ఇదేం లెక్క గురూ !!
బిజినెస్ అనేది ఎలా జరగాలి? హీరోల మార్కెట్ మీదా? పెట్టిన బడ్జెట్ మీదా? సబ్జెక్టుకు వచ్చిన హైప్ మీదా? కాంబోకున్న క్రేజ్ మీదా? సీజన్‌కున్న చరిష్మా మీదా? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరగాలి? ఇప్పుడు టాలీవుడ్‌లో బిజినెస్ ఎలా జరుగుతోంది? హీరోలు, కాన్సెప్టులు, కాంబోలు, బడ్జెట్‌లు, సీజన్‌లు... ఏవి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి... డిస్కస్ చేసుకుందాం వచ్చేయండి... మిస్టర్ బచ్చన్ సినిమాకు రూ.40కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Updated on: Jul 27, 2024 | 11:15 AM

బిజినెస్ అనేది ఎలా జరగాలి? హీరోల మార్కెట్ మీదా? పెట్టిన బడ్జెట్ మీదా? సబ్జెక్టుకు వచ్చిన హైప్ మీదా? కాంబోకున్న క్రేజ్ మీదా? సీజన్‌కున్న చరిష్మా మీదా? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరగాలి? ఇప్పుడు టాలీవుడ్‌లో బిజినెస్ ఎలా జరుగుతోంది? హీరోలు, కాన్సెప్టులు, కాంబోలు, బడ్జెట్‌లు, సీజన్‌లు... ఏవి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి... డిస్కస్ చేసుకుందాం వచ్చేయండి...

మిస్టర్ బచ్చన్ సినిమాకు రూ.40కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. హరీష్‌శంకర్ సినిమా వచ్చి చాన్నాళ్లయింది. రవితేజకు రీసెంట్ టైమ్స్ లో హిట్ లేదు. మరి ఇంత ఎలా సాధ్యమైంది? అంటే... దాన్నే టైమ్ అంటారు. యస్... ఆగస్టు 15మీదున్న కాన్ఫిడెన్స్ అలాంటిది మరి. ఆ కాన్ఫిడెన్సే డబుల్ ఇస్మార్ట్ కి కూడా వర్కవుట్ అయింది.

ఓ వైపు పోలీస్ డ్రామా, ఇంకో వైపు సోకులపాళెం వ్యథలు.. అంటూ సాగుతుంది ట్రైలర్. యముడు, చిత్రగుప్తుడు.. ఒకే వ్యక్తిలో స్ప్లిట్ పర్సనాలిటీలా ఉంటే ఎలా ఉంటుందనే ఊహ ఎప్పుడైనా వచ్చిందా? ఇక ఊహించుకోవడం ఎందుకు?

నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి.. ఎక్స్ పెక్ట్ చేసింత విజయం కాలేదు. అయినా ఇక్కడ బేఫికర్ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు సీన్ ఏంటి? సిట్చువేషన్ ఏంటి? దాని గురించి మాత్రమే లెక్కలేయమంటున్నారు. నందమూరి బాలకృష్ణ 109కి 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంలోనూ ఇదే ఫార్ములా పనిచేసింది.

తెలుగు హీరోలకే కాదు, తమిళ హీరోలకు కూడా సీజన్ క్రేజ్ కలిసొస్తోంది. వరుస సెలవులు, భారీగా తెరకెక్కించిన కాన్సెప్టులు బిజినెస్ మీద హైప్ పెంచుతున్నాయి. ఆగస్టులో రిలీజ్ కానున్న తంగలాన్, సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న గోట్, అక్టోబర్‌లో రానున్న కంగువ... ఈ క్రేజ్‌తోనే క్రేజీ నెంబర్స్ చూస్తున్నాయి.




