AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Engineering Seats: తెలంగాణలో ఇంజినీరింగ్‌ బి-కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో బి-కేటగిరీ అంటే యాజమాన్య కోటా కింద ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు జులై 31 సాయంత్రం సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 9వ తేదీలోపు నోటిఫికేషన్‌ జారీ చేసి, నోటిఫికేషన్‌ విడుదల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి కనీసం ఆరు రోజులు గడువు ఇస్తున్నట్లు విద్యామండలి..

TG Engineering Seats: తెలంగాణలో ఇంజినీరింగ్‌ బి-కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
TG Engineering Seats
Srilakshmi C
|

Updated on: Aug 01, 2024 | 3:09 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో బి-కేటగిరీ అంటే యాజమాన్య కోటా కింద ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు జులై 31 సాయంత్రం సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 9వ తేదీలోపు నోటిఫికేషన్‌ జారీ చేసి, నోటిఫికేషన్‌ విడుదల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి కనీసం ఆరు రోజులు గడువు ఇస్తున్నట్లు విద్యామండలి పేర్కొంది. ఆగస్టు 29లోపు సీట్ల భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. బీ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థుల పూర్తి వివరాలను సెప్టెంబరు 10వ తేదీలోపు తమకు సమర్పించాలని ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలను ఆదేశించింది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.11 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 30 శాతం సీట్లను యాజమన్యం కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇందులో 15 శాతం ఎన్‌ఆర్‌ఐలకు కేటాయిస్తారు. ఈ కోటా కింద సీట్లు పొందిన విద్యార్ధులు ఎన్‌ఆర్‌ఐలు సిఫార్సు చేసిన వారై ఉండాలి. మిగిలిన 15 శాతం సీట్లను తొలుత జేఈఈలో ర్యాంకు ఆధారంగా, తర్వాత ఎంసెట్‌ ర్యాంకు ఆ ధారంగా భర్తీ చేస్తారు. ఈ కోటా కింద ప్రవేశాలు పొందేవారు సంబంధిత సబ్జెక్టుల్లో 45 శాతం కనీస మార్కులు కలిగి ఉండాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు.

సీటెట్‌ 2024 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌తోపాటు సంబంధిత వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా సీటెట్ పరీక్ష జులై 7వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీఎస్సీ సీటెట్​పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. మొత్తం రెండు పేపర్‌లను ఈ పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్​ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. రెండో పేపర్​ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​స్కోర్‌కు లైఫ్​లాంగ్​వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?