శరీరంపై వివిధ భాగాల్లో పుట్టుమచ్చలు ఉండటం సాముద్రిక శాస్త్రంలో శుభం లేదా అశుభం కూడా నిర్ణయిస్తుంది. శరీరంపై పుట్టుమచ్చల రంగు కూడా దీనిపై ప్రభావం చూపుతుంది. నలుపు లేదా ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే ఏం జరుగుతుందంటే.. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంపై ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎర్ర మచ్చలు సంపద, ప్రభావం, శ్రేయస్సు, ఆనందానికి చిహ్నం.