AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు పది లక్షల వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరే లాభాలు

వ్యాపారం చేయాలనుకునే వారికి ముందుగా వేధించేది పెట్టుబడి సమస్య. అందువల్ల తక్కువ పెట్టుబడితో మంచి రాబడినిచ్చే వ్యాపారన్ని చేయాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ మీకు ఒక మంచి ఎంపికగా ఉంటుంది. ఇక్కడ మీరు కంపెనీ అభివృద్ధి చెందుతున్న డైరీ వ్యాపారంలో భాగమై నెలకు రూ. 5 నుండి రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు.

Business Idea: రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు పది లక్షల వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరే లాభాలు
Business Idea
Nikhil
|

Updated on: Mar 21, 2024 | 5:00 PM

Share

ప్రస్తుత రోజుల్లో యువత ఉద్యోగం కంటే వ్యాపారమే మేలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఒకరి కింద పని చేసే కంటే కష్టపడి మనకు మనమే బాస్‌లా ఉండాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అయితే వ్యాపారం చేయాలనుకునే వారికి ముందుగా వేధించేది పెట్టుబడి సమస్య. అందువల్ల తక్కువ పెట్టుబడితో మంచి రాబడినిచ్చే వ్యాపారన్ని చేయాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ మీకు ఒక మంచి ఎంపికగా ఉంటుంది. ఇక్కడ మీరు కంపెనీ అభివృద్ధి చెందుతున్న డైరీ వ్యాపారంలో భాగమై నెలకు రూ. 5 నుండి రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక రాబడినిచ్చే అమూల్ వ్యాపారంలో ఎలా భాగస్వామ్యులుగా మారాలో? ఓ సారి తెలుసుకుందాం.

అమూల్ రెండు పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ఇక్కడ మీరు రూ.2 లక్షల వరకు ప్రారంభ పెట్టుబడితో అమూల్ అవుట్‌లెట్‌ని ఎంచుకోవచ్చు లేదా సుమారు 5 లక్షల పెట్టుబడితో ఫ్రాంఛైజీ అవకాశాన్ని పొందవచ్చు. అయితే మీరు అమూల్ బిజినెస్ ఫ్రాంచైజీతో చాలా ఉదారంగా కమీషన్ పొందవచ్చు. ఉదాహరణకు మీరు పాల ప్యాకెట్లపై 2.5 శాతం, పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్ క్రీమ్ విక్రయాలపై 20 శాతం కమీషన్ పొందుతారు. ఇంకా మీరు రెసిపీ ఆధారిత ఐస్ క్రీమ్‌లు, షేక్‌లు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, హాట్ చాక్లెట్ డ్రింక్స్‌పై 50 శాతం భారీ కమీషన్‌ను కూడా పొందవచ్చు.

మీ అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు అమూల్ అవుట్‌లెట్ కోసం సుమారు 150 చదరపు అడుగుల స్థలం అవసరం. అలాగే మీరు ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీని ప్రారంభించాలని అనుకుంటే మీకు దాదాపు 300 చదరపు అడుగుల స్థలం అవసరం. ఒప్పందంపై సంతకం చేసే సమయంలో జీసీఎంఎంఎఫ్ లిమిటెడ్ పేరుతో జారీ చేసిన చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే రూ.25,000 తిరిగి చెల్లించదగిన సెక్యూరిటీ డిపాజిట్‌ను తీసుకుంటుంది.  కంపెనీ అధీకృత ప్రతినిధులు వ్యక్తిగతంగా కాబోయే భాగస్వాములను కలుసుకుని నిర్ణీత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే చెల్లింపు తీసుకుంటారు. అమూల్ పార్లర్ డిపాజిట్ కోసం ఆర్‌టీజీఎస్/నెఫ్ట్ ద్వారా ఎలాంటి చెల్లింపును తీసుకోరు. అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు అమూల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఫ్రాంచైజ్ అవకాశాల గురించి సంబంధిత సమాచారాన్ని అన్వేషించవచ్చు. అమూల్ డిస్ట్రిబ్యూటర్‌గా నియామకం కోసం డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం అన్ని రకాల విచారణల కోసం మీరు అమూల్ అధికారిక కస్టమర్ కేర్ (022) 6852666కు కాల్ చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్