NEET PG 2024 Preponed: నీట్ పీజీ 2024 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే
నీట్ పీజీ 2024 పరీక్ష తేదీ మరోమారు మారింది. ఈ పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్టు బుధవారం (మార్చి 20) నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ప్రకటించింది. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PGMEB), నేషన్ మెడికల్ కమిషన్ సంయుక్తంగా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, హెల్త్ సైన్సెస్ డైరెక్టరేట్ జనరల్, మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌తో నిర్వహించిన సమావేశంలో రీషెడ్యూల్..
న్యూఢిల్లీ, మార్చి 21: నీట్ పీజీ 2024 పరీక్ష తేదీ మరోమారు మారింది. ఈ పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్టు బుధవారం (మార్చి 20) నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ప్రకటించింది. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PGMEB), నేషన్ మెడికల్ కమిషన్ సంయుక్తంగా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, హెల్త్ సైన్సెస్ డైరెక్టరేట్ జనరల్, మెడికల్ సైన్సెస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌తో నిర్వహించిన సమావేశంలో రీషెడ్యూల్ చేసింది. కాగా ఇప్పటికే నీట్ పీజీ 2024 పరీక్ష రెండు సార్లు వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం.. మార్చి 3వ తేదీన పరీక్ష నిర్వహించవల్సి ఉంది. అయితే ఈ పరీక్షను జులై 7న నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గత జనవరిలో ప్రకటించింది. ఇప్పుడు అంతకంటే ముందే జూన్ నెలలోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు నీట్ పీజీ అభ్యర్ధులు గమనించాలని తన ప్రకటనలో కోరింది. పరీక్షకు అర్హత కటాఫ్ తేదీ ఆగస్టు 15గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.
నీట్ పీజీ పరీక్ష అనంతరం ఫలితాలు జూలై 15 వ తేదీన ప్రకటిస్తామని పేర్కొంది. ఆగస్టు 5వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 16 నుంచి కొత్త అకాడమిక్ సెషన్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. కాగా మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి ప్రతీయేట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. NEET-PG అనేది నేషనల్ మెడికల్ కమీషన్ యాక్ట్ 2019 ప్రకారం వివిధ MD, MS, PG మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఒకే అర్హత-కమ్-ర్యాంకింగ్ ప్రవేశ పరీక్ష.
నీట్ యూజీ 2024 పూర్తి షెడ్యూల్ ఇదే..
- నీట్ యూజీ 2024 పరీక్ష తేదీ: జూన్ 23, 2024.
- ఫలితాల ప్రకటన తేదీ: జూలై 15, 2024.
- కౌన్సెలింగ్ తేదీలు: ఆగస్టు 5, 2024 నుంచి అక్టోబర్ 15, 2024 వరకు
- అకడమిక్ సెషన్ ప్రారంభం: సెప్టెంబర్ 16, 2024.
- కాలేజీల్లో ప్రవేశాలకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.