TG TET Vs UGC NET: ఒకే షెడ్యూల్లో టెట్‌, యూజీసీ నెట్‌ పరీక్షలు.. అభ్యర్ధుల్లో గందరగోళం

తెలంగాణ రాష్ట్రంలో జరగుతున్న పోటీ పరీక్షలకు జాతీయ స్థాయిలో జరగనున్న పలు పరీక్షల తేదీలు పేచీలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష తేదీల్లో RRB పరీక్ష ఉండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో టెట్ పరీక్షకు కూడా యూజీసీ నెట్ పరీక్ష అడ్డంకిగా మారింది. దీంతో రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారు ఏదో ఒకటి వదులుకోవల్సి వస్తుంది..

TG TET Vs UGC NET: ఒకే షెడ్యూల్లో టెట్‌, యూజీసీ నెట్‌ పరీక్షలు.. అభ్యర్ధుల్లో గందరగోళం
TG TET Vs UGC NET Exam dates
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 03, 2024 | 12:38 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) దరఖాస్తు ప్రక్రియ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 2,75,773 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26న విడుదలవనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. ఈ మేరకు విద్యాశాఖ పక్కా షెడ్యూల్‌ రూపొందించి ప్రకటనమేరకే పరీక్షలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయితే సరిగ్గా ఇదే తేదీల్లో యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌(నెట్‌) పరీక్షలు కూడా ఉన్నాయి.

ఇటీవల విడుదలైన యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌లో ఈ మేరకు పరీక్ష తేదీలను వెల్లడించింది. యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం డిసెంబర్‌ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ పరీక్షలు జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని యూజీసీ తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో అటు టెట్‌.. ఇటు యూజీసీ నెట్‌ రెండు పరీక్షలు ఒకే తేదీల్లో జరగనున్నాయి. దీంతో టెట్‌ను వాయిదావేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షకు కూడా ఇదే విధమైన సమస్య ఎదురైంది. రైల్వే శాఖ నిర్వహించే ఆర్ఆర్‌బీ పరీక్ష కూడా గ్రూప్‌ 2 పరీక్ష జరిగే రోజునే వచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు ఆర్‌ఆర్‌బీ పరీక్ష డిసెంబర్‌ 16న జరగనుంది. దీంతో ఒక పరీక్ష రాయాలంటో మరో పరీక్షను వదులుకోవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్ధులు గ్రూప్‌ 2ను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిపై రేవంత్‌ సర్కార్‌ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.