DOST And EAMCET: డిగ్రీ కంటే వృత్తి విద్యా కోర్సులకు పెరుగుతోన్న ఆసక్తి.. కొనసాగుతోన్న దరఖాస్తుల తీరే దీనికి నిదర్శనం.
DOST And EAMCET: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షనుల రద్దు చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం డిగ్రీ సీట్ల భర్తీ కోసం దోస్త్, వృత్తి విద్య కోర్సుల కోసం ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే...
DOST And EAMCET: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షనుల రద్దు చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం డిగ్రీ సీట్ల భర్తీ కోసం దోస్త్, వృత్తి విద్య కోర్సుల కోసం ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నమోదవుతోన్న రిజిస్ట్రేషన్ల వివరాలు చూస్తే డిగ్రీ కంటే ఎక్కువగా వృత్తి విద్యా కోర్సులైన బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో చేరడానికే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 9 వరకు దోస్త్ వెబ్‌సైట్‌లో డిగ్రీ సీట్ల కోస కేవలం 63, 623 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఎంసెట్‌కు మాత్రం ఇప్పటి వరకు 2,46,110 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇక దోస్త్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15తో ముగియనుండగా, ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ 19తో ముగియనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 4,73,850 మంది విద్యార్థులను ప్రభుత్వం ఇంటర్‌లో ఉత్తీర్ణులుగా నిర్ణయించింది. అయితే వీరిలో అత్యధికంగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. నిజానికి అధికారులు ఈసారి ఎంసెట్ కంటే ఎక్కువగా డిగ్రీకే విద్యార్థులు మొగ్గు చూపుతారని భావించారు. కానీ దీనికి భిన్నంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దోస్త్ దరఖాస్తుల స్వీకరణకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఏమైనా పెరుగుతాయో చూడాలి. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉత్తీర్ణులైన సగానికి పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాసేందుకే దరఖాస్తులు చేసుకోవడం ఆసక్తిరంగా మారింది.
Also Read: Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు.. ఖాళీల లెక్క తేల్చే పనిలో మంత్రి హరీష్ రావు