Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌లో పలు విభాగాల్లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే.

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం..

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌లో పలు విభాగాల్లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే.
Hsl Recruitment 2021
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 10, 2021 | 9:48 PM

Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డీజీఎం, సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ కన్సల్టెంట్ & కన్సల్టెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. * పర్మినెంట్‌ విభాగంలో జనరల్ మేనేజర్ (01), అడిషనల్ జనరల్ మేనేజర్ (01), డీజీఎం (03), సీనియర్ మేనేజర్ (04), మేనేజర్ (08), డిప్యూటీ మేనేజర్ విభాగంలో (08) పోస్టులను భర్తీ చేయనున్నారు. * కాంట్రాక్ట్‌ విభాగంలో ఖాళీల వివరాలు.. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (02), ప్రాజెక్ట్ మేనేజర్ (01), ప్రాజెక్ట్ ఆఫీసర్ (28), సీనియర్ కన్సల్టెంట్ (03), కన్సల్టెంట్ విభాగంలో (01) ఖాళీలు ఉన్నాయి. * జనరల్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్‌లో 20 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. * అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. పబ్లిక్ సెక్టార్‌లో 16 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి. * DGM పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/గ్రాడ్యుయేట్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. 15 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి. * సీనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెకానికల్/ఎలక్ట్రికల్/నావల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 12 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 23 ప్రారంభమయ్యాయి. చివరి తేదీలు ఒక్కో పోస్ట్‌కు ఒక్కోలా ఉన్నాయి. * అభ్యర్థులు https://www.hslvizag.in/content/200_1_Careers.aspx వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం.. క్లిక్‌ ఇయర్‌ టు అప్లైపై క్లిక్‌ చేసిన తర్వాత మీరు కోరుకున్న జాబ్‌ లింక్‌పై క్లిక్‌ చేసిన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Indian Navy SSC: బీటెక్‌ విద్యార్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. పెళ్లి కానీ పురుషులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారానే.

TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. ఇప్పటి వరకు ఎంత మంది అప్లై చేసుకున్నారో తెలుసా?

BDL Recruitment: హైదరాబాద్‌ బీడీఎల్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా పోస్టుల భర్తీ. ఎవరు అర్హులంటే.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే