TS Tenth Exam Fee: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువు అధికారులు పొడిగించారు. ఎటువంటి జరిమానా లేకుండా..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువు అధికారులు పొడిగించారు. ఎటువంటి జరిమానా లేకుండా ఫీజు చెల్లించే గడువును నవంబరు 24వ తేదీ వరకు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం గడువు మంగళవారంతో ముగియనుండగా తాజాగా దానిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త తేదీలివే..
- ఎటువంటి ఆలస్య రుసుములేకుండా ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్ 24, 2022.
- రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 5, 2022.
- రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.
- రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 29, 2022.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.