Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచి అందుబాటులోకి పాఠ్యపుస్తకాలు.. ఆడియో, వీడియోల కోసం ప్రత్యేకంగా..

Telangana: తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభమై దాదాపు 15 రోజులు గడుస్తున్నాయి అయితే ఇప్పటికే పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేవు. కాగిత ధర, టెండర్లు ఖరారు చేయడంలో ఆలస్యం కావడంతో పాఠ్య పుస్తకాల పంపిణీలో...

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచి అందుబాటులోకి పాఠ్యపుస్తకాలు.. ఆడియో, వీడియోల కోసం ప్రత్యేకంగా..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 25, 2022 | 12:30 PM

Telangana: తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభమై దాదాపు 15 రోజులు గడుస్తున్నాయి అయితే ఇప్పటికే పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేవు. కాగిత ధర, టెండర్లు ఖరారు చేయడంలో ఆలస్యం కావడంతో పాఠ్య పుస్తకాల పంపిణీలో ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాఠ్యాపుస్తకాల పంపిణీ విషయమై ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రచురణల డైరెక్టర్‌ శ్రీనివాస చారి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఈ నెల 27 నుంచి బహిరంగ మార్కెట్‌లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయన్ని తెలిపారు.

ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా విద్యాధికారి నుంచి పర్మిషన్‌ పొంది కేంద్రాల్లో అమ్మాకాలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీ, అమ్మకాల కాంట్రాక్టును 13 ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించినట్లు శ్రీనివాస చారి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ ధరలు వసూలు చేస్తే డీఈఓలకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ సామాగ్రిని కొనుగోలు చేయాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటామని శ్రీనివాస చారి హెచ్చరించారు.

ఈసారి నుంచి ఆడియో, వీడియో రూపంలో..

ఈఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో అధికారులు చాప్టర్ల వారీగా క్యూఆర్‌ కోడ్ ప్రచురించారు. తద్వారా ఈ క్యూఆర్‌ కోడ్‌లను స్మార్ట్ ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే విద్యార్థులు ఆడియో, వీడియో రూపంలో పాఠ్యాంశాలను వినే అవకాశం ఉంటుంది. మరింత సులభంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..