RGUKT Basar Admissions 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచే..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌-TS RGUKT)లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం (జూన్‌ 30) నోటిఫికేషన్‌..

RGUKT Basar Admissions 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచే..
Rgukt Basar
Follow us

|

Updated on: Jul 01, 2022 | 3:59 PM

TS RGUKT IIIT Basara notification 2022-2023: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌-TS RGUKT)లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం (జూన్‌ 30) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత యేడాది (2021-22) తెలంగాణ పాలిసెట్‌-2021లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే ఈసారీ పాలిసెట్‌ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నోటిఫికేషన్‌ను మొదట్లో విడుదల చేసినప్పటికీ.. అలా చేస్తే గ్రామీణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పలు వర్గాల నుంచి వినతులు రావడంతో ఉన్నత విద్యామండలి పునరాలోచన చేసి పాత పద్ధతిలోనే, పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో మొదటి ప్రయత్నంలోనే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.400 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.350)లు చెల్లించవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జులై 1, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: జులై 15, 2022.
  • దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: జులై 19, 2022.
  • సెలక్షన్‌ లిస్టు విడుదల తేది: జులై 30, 2022.

వివరణాత్మక బాసర ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.