TS DOST 2022: నేటి నుంచి ప్రారంభమైన తెలంగాణ దోస్త్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ..

తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జులై 1) నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌..

TS DOST 2022: నేటి నుంచి ప్రారంభమైన తెలంగాణ దోస్త్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ..
Ts Dost
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2022 | 3:08 PM

TS DOST 2022 Schedule: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జులై 1) నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ నోటిఫికేషన్‌ (DOST Notification 2022) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 4.25 లక్షల సీట్ల భర్తీ చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 1080 డిగ్రీ కాలేజీలుండగా, అందులో 129 ప్రభుత్వ కాలేజీలున్నాయి. ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏదైనా కోర్సును 15 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఎంచుకుంటే ఆ కోర్సును మార్చుకునేలా విద్యార్ధులకు అవకాశం కల్పించారు. అలాగే ఏ కాలేజీలోనైనా 15 మంది కంటే తక్కువ మంది విద్యార్ధులు జాయిన్ ఐతే ఆ కాలేజీ నుంచి దగ్గర్లోని వేరే కాలేజీకి విద్యార్ధులను బదిలీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గతేడాది 56 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదవడంతో ఆయా కాలేజీలను మూసివేశారు. ఈ ఏడాది కూడా అదే పద్ధతిని అనుసరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి (TSCHE) తెల్పింది.

ఇదీ షెడ్యూల్‌..

ఇవి కూడా చదవండి
  • దోస్త్‌ ఫేజ్ 1 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: జులై 1 నుంచి 30 వరకు
  • పేజ్ 1 వెబ్ ఆప్షన్లు: జులై 6 నుంచి 30వ తేదీ వరకు
  • ఫేజ్ 1 సీట్స్ కేటాయింపు: ఆగస్టు 6
  • పేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ఆగస్టు 7 నుంచి ఆగస్టు 21 వరకు
  • పేజ్ 2 వెబ్ ఆప్షన్లు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 22 వరకు
  • పేజ్ 2 సీట్స్ అలాట్‌మెంట్ ఆగస్టు 27
  • ఫేజ్ 3 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
  • ఫేజ్ 3 సీట్స్ అలాట్‌మెంట్: సెప్టెంబర్ 16
  • డిగ్రీ రెగ్యులర్ తరగతులు ప్రారంభం: అక్టోబర్ 1 నుంచి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!