AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: అగ్నివీరులు కిరాయి సైనికులా? పంజాబ్‌ అసెంబ్లీలో ‘అగ్నిపథ్‌’ వ్యతిరేక తీర్మాణం

వివాదాస్పద అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టడానికి పంజాబ్‌ అసెంబ్లీ సిద్ధమవుతోంది. సాయుధ బలగాల నియామకాలకు కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం (జూన్‌ 28) పిలుపునిచ్చారు..

Punjab: అగ్నివీరులు కిరాయి సైనికులా? పంజాబ్‌ అసెంబ్లీలో 'అగ్నిపథ్‌' వ్యతిరేక తీర్మాణం
Cm Bhagwant Mann
Srilakshmi C
|

Updated on: Jun 30, 2022 | 3:57 PM

Share

Punjab Govt Passes a resolution against Agneepath: వివాదాస్పద అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టడానికి పంజాబ్‌ అసెంబ్లీ సిద్ధమవుతోంది. సాయుధ బలగాల నియామకాలకు కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం (జూన్‌ 28) పిలుపునిచ్చారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశంలో సీఎం భగవంత్‌ మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ను పూర్తిగా అర్థం చేసుకోగలిగితే, అదెంత ప్రయోజనకారో తెలుస్తుందని కమన నాథులు అంటున్నారు. అగ్నిపథ్‌ స్కీంను అర్థం చేసుకునే సామర్థ్యం కేవలం వాళ్లకు (బీజేపీ నాయకులకు) మాత్రమే ఉందా? దేశ వ్యాప్తంగా మరెవ్వరీ లేదా? మనం మేధావులం కాదా? సామాన్య ప్రజలకు అర్థంకాని, అర్థం చేసుకోలేని చట్టాలను చేయకూడదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తీర్మీనాలు లేవనెత్తాలి. అగ్నిపథ్‌ పథకం గురించి ఆలోచిస్తే.. 17 ఏళ్లకు ఒక వ్యక్తి నియామకమైతే నాలుగేళ్ల తర్వాత అంటే 21 ఏళ్లకు అతను సైన్యం నుంచి వెనక్కి వస్తాడు. అప్పటికీ అతను పెళ్లికాకుండా ఉంటాడు. కనీసం మాజీ సైనికుడనే గుర్తింపుకు కూడా నోచుకోడు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష తీర్మానాన్ని తీసుకురావాలని పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ డిమాండ్‌ చేశారు.

అనంతరం ప్రతిపక్ష నాయకుడు పర్తాప్ సింగ్ బజ్వా ఈ విధంగా విధానసభలో వ్యాఖ్యానించారు.. ‘గతంలో పంజాబ్ యువకుల్లో 20 శాతం మంది డిఫెన్స్‌ ఫోర్సుల్లో నియమితులయ్యారు. జనాభా ప్రాతిపదికన చూస్తే 7.8 శాతం పంజాబ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులు ఎంపికయ్యినట్లు ఎత్తి చూపారు. అగ్నిపథ్ పథకం వల్ల భవిష్యత్తులో 2.3 శాతం మేర తగ్గుతుదల కనిపిస్తుంది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి తీర్మానం తీసుకురావాలి. పంజాబ్‌ రెజిమెంట్‌ దేశంలోనే అతి పురాతనమైనది. అందునా సిక్కుల రెజిమెంట్‌ అత్యంత ప్రసిద్ధి చెందింద’ని బజ్వా పేర్కొన్నారు.

అగ్నివీరులు కిరాయి సైనికులా.. ‘అగ్నివీరులకు కిరాయి సైనికులుగా శిక్షణ ఇచ్చి, నాలుగేళ్ల కాలంలో తుపాకీ పట్టించి, 21 ఏళ్లు వచ్చిన తర్వాత వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటికి పంపించేస్తాం అంటోంది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల ఏ విధమైన సందేశం ఇస్తున్నారు ?’ అని బజ్వా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి.