BJP: మహానగరంలో బీజేపీ భారీ వ్యూహం.. ఎవరు ఎవరితో – టార్గెట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

BJP National Executive Meeting: భారతీయ జనతా పార్టీ నేతల రాకతో హైదరాబాద్ మహానగరం సందడిగా మారబోతోంది. బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా తెలంగాణ చేరుకోబోతున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

BJP: మహానగరంలో బీజేపీ భారీ వ్యూహం.. ఎవరు ఎవరితో - టార్గెట్ ఫిక్స్..  పూర్తి షెడ్యూల్ ఇదే..
Pm Modi
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 4:34 PM

భారతీయ జనతా పార్టీ(BJP) నేతల రాకతో హైదరాబాద్ మహానగరం సందడిగా మారబోతోంది. బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా తెలంగాణ చేరుకోబోతున్నారు. ఇప్పటికే 40 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. జులై 2, 3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 119 మంది జాతీయ నేతలు, కేంద్రమంత్రులకు 119 నియోజకవర్గాలను కేటాయించారు. శుక్రవారం రోజంతా అక్కడే ఉండి.. శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. కొన్ని చోట్ల హాల్ మీటింగ్స్ పెట్టనున్నారు కేంద్రమంత్రులు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బూత్ కమిటీల పరిశీలన, పార్టీ పరిస్థితిపై అధ్యాయనం చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, అబ్బాస్ నఖ్వీ తదితరులు పాతబస్తీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కిరణ్ రిజిజు రాజేంద్రనగర్‌లో, అనురాగ్ సింగ్ ఠాగూర్ కుత్బుల్లాపూర్లో పర్యటించనున్నారు.

ఇదిలావుంటే జాతీయ కార్యవర్గ సమావేశాల సరళి ఈ విధంగా ఉండనుంది. ముందుగా తొలి రోజు అంటే జూలై 1న మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్‌ పట్టణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో పాల్గొని 4 గంటలకు హెచ్‌ఐసీసీ లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ ఉద్యమం-బీజేపీ పోరాటాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నడ్డా ప్రారంభిస్తారు.రాత్రి 7 గంటలకు నోవాటెల్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశం. జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా, ప్రతిపాదిత తీర్మానాలపై సమీక్ష. రాత్రి 8.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు. జూలై 2 ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. 4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి.బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. జూలై 3 ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపు. సాయంత్రం 4 గంటలకు మోదీ ముగింపు ఉపన్యాసం. 4.30 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు పాల్గొంటారు. జూలై 4 పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బయలుదేరి భీమవరం వెళతారు.

కట్టుదిట్టమైన భద్రత..

ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 5వేల మంది పోలీసు బలగాలతో మూడెంచల ప్రత్యేక భద్రత కల్పిస్తారు.బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్, జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసీసీ, నోవోటెల్ మైదానాల చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇతర కేంద్ర భద్రతా బలగాల పహారా ఎలాగూ ఉంటుంది. వీరితో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ పోలీసులు మోడీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు.

తెలంగాణ వార్తల కోసం