Konda Vishweshwar Reddy: ఎందుకు బీజేపీలో చేరుతున్నానంటే.. క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

BJP-Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. అందువల్లే

Konda Vishweshwar Reddy: ఎందుకు బీజేపీలో చేరుతున్నానంటే.. క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
Konda Vishweshwar Reddy
Sanjay Kasula

|

Jun 30, 2022 | 6:22 PM

బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాను అంటూ సంచలన నిర్ణయం ప్రకటించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy). ఏ రోజు ఎక్కడ పార్టీలో చేరతా అనేది బీజేపీ నేతలకే వదిలేశని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాని అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందన్నారు. కొంతకాలంగా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీతో మాత్రమే అవుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకున్నాను. కానీ, రాష్ట్రం ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. అప్పుల రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి శూన్యం. ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ అజయ్ కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. ఉద్యమ కారులను మోసం చేసి ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకుంటున్నారు సీఎం కేసీఆర్. దోచుకోవడమే ప్రదాన ఎజెండాగా కేసీఆర్ పాలన ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేకత ఓటు బీజేపీ అందిపుచ్చుకుంటుందనే అని నమ్మకం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సక్యతతో ఉంటే ఎన్ని నిధులు అయినా తెచ్చుకోవచ్చన్నారు. ఎపీ సీఏం జగన్ కేంద్రంతో సఖ్యత ఉండి.. నిధులు తెచ్చుకుంటుంన్నారు కదా అంటూ ప్రశ్నించారు. ఫ్లేక్సీ వార్‌తో టీఆర్ఎస్ దిగజారి రాజకీయాలు చేస్తోంద విమర్శించారు. ఈటెల గెలుపుతో కేసీఆర్ సగం ఓడిపోయారని.. ఇంకో బై ఎలక్షన్ వస్తే టీఆర్ఎస్ పూర్తిగా అంతరించిపోతుందని జోస్యం చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజూరాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని.. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ లోనే ఉండేవాడినని అన్నారు. తాను రేవంత్‌కు వ్యతిరేకం కాదన్నారు.

బీజేపీ పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ.. తానేమీ పదవులు ఆశించి బీజేపీలోకి వెళ్లడం లేదన్నారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో పని చేసేందుకు బీజేపీలో చేరుతున్నానని వెల్లడించారు.

 తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu