Hyderabad: బీజేపీకి ఊహించని షాక్.. TRS తీర్థం పుచ్చుకున్న నలుగురు కార్పొరేటర్లు.. వారు ఎవరంటే..?
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు కాషాయ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు GHMC కార్పోరేటర్లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
Telangana: హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్‌లో చేరగా… కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు. ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ(PM Modi) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రధాని మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‌లో చేరడం బీజేపీకి ఊహించని షాక్ అనే చెప్పాలి. చేరికల కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్ పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే బీజేపీకి బిగ్ షాక్.
బీజేపీ కి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. pic.twitter.com/HAf4ZIJuRN
— KMR@KTR (@kmr_ktr) June 30, 2022