TS Inter Admissions 2022: రేపట్నుంచి తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ 2022 ప్రవేశాలు.. జులై 11 నుంచి తరగతులు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలన్నింటిలో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు గురువారం (జూన్‌ 30) ప్రకటించింది..

TS Inter Admissions 2022: రేపట్నుంచి తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ 2022 ప్రవేశాలు.. జులై 11 నుంచి తరగతులు..
Tsbie
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2022 | 3:31 PM

TS Inter First Year Admission Schedule 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలన్నింటిలో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు గురువారం (జూన్‌ 30) ప్రకటించింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇంటర్‌ బోర్డు ఈ సందర్భంగా తెల్పింది. ఈ రోజు పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్‌మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు జులై 1 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు తెల్పింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం..

జులై 11 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయి. ఫస్ట్‌ ఫేస్‌ ప్రవేశాలు ఆగస్టు 17తో ముగుస్తాయి. ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు చేపట్టాలని బోర్డు అన్ని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్లకు సూచించింది. ఐతే పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్, టీసీ సమర్పించిన తర్వాత మాత్రమే అడ్మిషన్‌ నిర్ధరణ అవుతుంది. అడ్మిషన్ కోసం ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేశాలు చేపట్టిన జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అలాగే మొత్తం సీట్ల సంఖ్య, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను తెలుపుతూ నోటీసును ప్రతి కాలేజీ బయట ఉంచాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారు. ఇతర పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ https://acadtsbie.cgg.gov.in/ లేదా https://tsbie.cgg.gov.in/లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.