Manipur: విషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు జవాన్లు మృతి..
Manipur: మణిపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. 45 మంది గల్లంతయ్యారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపడుతోంది...
Manipur: మణిపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. 45 మంది గల్లంతయ్యారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపడుతోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ దుర్ఘాటన గురించి ఆర్మీ అధికారులు మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు 19 మందిని రక్షించాం. క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్ యూనిట్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాం. ఏడుగురి మృత దేహాలు’ లభ్యమయ్యాయని తెలిపారు.
ఇక మణిపుర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపిన ముఖ్యమంత్రి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, వైద్యులతో సహా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
#WATCH | NDRF, SDRF, State Government and Railways workers involved in rescue work at the landslide-hit Tupul station building in Noney, Manipur (Video credit: CPRO, NF Railway) pic.twitter.com/N7zo2pLaY7
— ANI (@ANI) June 30, 2022
Manipur | Rescue operation underway after a massive landslide hit the company location of 107 Territorial Army of Indian Army deployed near Tupul railway station in Noney district. pic.twitter.com/sKzPCcWpyI
— ANI (@ANI) June 30, 2022
Noney, Manipur | 7 bodies have been recovered so far. Rescued people being shifted to hospital. Around 45 persons are still missing: Solomon L Fimate, SDO of Noney district pic.twitter.com/PZD8DEyWA2
— ANI (@ANI) June 30, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..