Bank of Baroda Recruitment 2022: బ్యాంక్‌ ఉద్యోగార్ధులకు అలర్ట్‌! బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. మేనేజర్‌ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Bank of Baroda Recruitment 2022: బ్యాంక్‌ ఉద్యోగార్ధులకు అలర్ట్‌! బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..
Bank Of Baroda
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2022 | 7:30 PM

Bank of Baroda Specialist Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. మేనేజర్‌ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • సీనియర్‌ మేనేజర్ పోస్టులు: 7
  • చీఫ్‌ మేనేజర్ పోస్టులు: 8

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.78,230ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/పీజీ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.