AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insulin Resistance: జాగ్రత్త! షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ తిరగబెట్టే అవకాశం ఎక్కువ

షుగర్‌ వ్యాధిగ్రస్థుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ (IR) తిరిగి అటాక్‌ చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాగంటే..

Insulin Resistance: జాగ్రత్త! షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' తిరగబెట్టే అవకాశం ఎక్కువ
Insulin Resistance
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2022 | 9:32 PM

How to reverse insulin resistance know here: నేటి కాలపు జీవనశైలి కారణంగా మన ఆరోగ్య వ్యవస్థ రోజురోజుకీ పతనమైపోతుందనేది కాదనలేని వాస్తవం. తినే ఆహారం నుంచి నిద్ర సమయాల వరకు ప్రతీ అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. టైంకి తిని, సమయానికి నిద్రపోతే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్‌ వ్యాధిగ్రస్తుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు పనికట్టుకుని శ్రద్ధగా ఉండి.. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడంతో కొంత మంది నిర్లక్ష్యంగా మునుపటి పంథాలో అలవాట్లకు మారిపోతుంటారు. కానీ ఇది మరింత ప్రమాదకరమని ప్రముఖ నూట్రీషనిస్ట్‌, క్లినికల్ డైటీషియన్ లక్షిత జైన్ హెచ్చరిస్తున్నారు. ఏందుకంటే షుగర్‌ వ్యాధిగ్రస్థుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ (IR) తిరిగి అటాక్‌ చేసే అవకాశం ఉందని జైన్ చెబుతున్నారు.

ఉదాహరణకు.. మనం ఒక జడ రబ్బర్‌ను సాగదీసి, కొంతసేపటికి వదిలేస్తే అది తిరిగి యథా స్థితికి చేరుకుంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. పోషకాహారం తినడం, శరీరక వ్యాయామం చేయడం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం వంటి అలవాట్లు జీవనశైలిలో భాగంగా పాటిస్తే ఐఆర్‌ సాగే స్థితిలో ఉంటుంది. షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉన్నాయని ఇష్టానుసారంగా జీవిస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి, శరీరంలో అనారోగ్య సమస్యలు దండెత్తుతాయని జైన్ అంటున్నారు. ఎన్ని రోజుల్లో తిరగబెడుతుందనేది వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడాలుంటాయి. ఐఆర్‌ను అభివృద్ధి పరచుకోవడానికి అందరికీ ఒకే విధమైన పద్ధతులుండవు. ఒక్క రోజులో ఐఆర్‌ను డెవలప్‌చేసుకోవడం కుదరని పని. అందుకు కొంత సమయం అవసరం అవుతుంది.

ఇన్సులిన్ నిరోధకత అంటే ఏమిటి? ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్‌. క్లోమం (పాంక్రియాస్‌) దీనిని ఉత్పత్తి చేస్తుంది. మనం తినే పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారి శరీరానికి శక్తినిస్తుంది. చెడు ఆహారపు అలవాట్లున్న వ్యక్తులు, ధూమపానం, ఆల్కహాల్ సేవించే వ్యక్తుల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. సాధారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్ ఎప్పటికప్పుడు వినియోగించబడుతుంది. ఐతే కొన్ని సందర్భాల్లో గ్లూకోజ్ వినియోగ సామర్థ్యం శరీరం కోల్పోతుంది. ఫలితంగా దాని నిల్వలు పెరిగిపోతాయి. ఈ విధమైన గ్లూకోజ్ రక్తంలోకి నేరుగా ప్రవేశిస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ (మధుమేహం) పరిస్థితికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో తలెత్తే ప్రధాన సమస్యలు.. ఐఆర్‌ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయాబెటిక్, ఊబకాయం, క్యాన్సర్‌కు దారితీసే T- కణాలు వృద్ధి చెందుతాయి.

ఆహార అలవాట్లు ఎలా ఉండాలంటే.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఐఆర్‌తో బాధపడేవారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను మితంగా తినాలి. ఐతే వీటిని అస్సలు తినకూడదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ మోతాదుకు మించకుండా పరిమితంగా తినవల్సిన అవసరం ఉంది. అలాగే పండ్లు, కూరగాయలను కూడా డైట్‌ చార్టులో చేర్చుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 300 నుంచి 350 గ్రాముల వరకు పండ్లు తినవచ్చు.

ఐఆర్‌ లక్షణాలు ఏవిధంగా ఉంటాయంటే.. మెడ, చంక లేదా శరీరంలో మరెక్కడైనా ముదురు వెల్వెట్ రంగులో మచ్చలుంటే మీ రక్తంలో ఇన్సులిన్‌ అధికంగా ఉందని సంకేతం. సాధారణంగా ఉబకాయం ఉన్న వ్యక్తుల్లో ప్రీ-డయాబెటిస్‌కు లక్షణాలు కనిపిస్తాయి. చర్మం మీద కనిపించే ఈ విధమైన మచ్చలను అకాంటోసిస్ నైగ్రికన్స్ (acanthosis nigricans) అని అంటారు. సరైన ఆహార అలవాట్లతో షుగర్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచుకుంటే శరీరంపై ఏర్పడిన ఈ ప్యాచ్‌లు తొలగిపోయే అవకాశం ఉందని నూట్రీషనిస్ట్‌ లక్షిత జైన్ సూచిస్తున్నారు.

మరిన్ని తాజా అప్‌డేట్ల కోసం క్లిక్‌ చేయండి.