APVVP East Godavari Jobs 2022: పది/ఇంటర్ అర్హతతో.. తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు..నెలకు రూ.54ల జీతం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన బయో మెడికల్ ఇంజినీర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర (Bio Medical Engineer Posts) పోస్టుల..
APVVP East Godavari Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన బయో మెడికల్ ఇంజినీర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర (Bio Medical Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 30
పోస్టుల వివరాలు:
- బయో మెడికల్ ఇంజినీర్ పోస్టులు: 4
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 1
- ఆడియోమెట్రిషియన్ పోస్టులు: 4
- థియేటర్ అసిస్టెంట్ పోస్టులు: 9
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 2
- కౌన్సెలర్ పోస్టులు: 1
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 3
- ప్లంబర్ పోస్టులు: 4
- పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు: 1
- జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.54,060ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, బీటెక్, బీఎస్సీ, బీఏ, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Coordinator of Hospital Services (APVVP), Rajamahendravaram, Govt Hospital, East Godavari District, AP.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.500
- ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులకు: రూ.300
- వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.