TG Inter Admissions: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు మరోమారు గడువు పెంపు.. ఎప్పటివరకంటే
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఇప్పటివకే పలుమార్లు ప్రవేశాల గడువు పొడిగించిన ఇంటర్ బోర్డు.. తాజాగా సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని..
హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఇప్పటివకే పలుమార్లు ప్రవేశాల గడువు పొడిగించిన ఇంటర్ బోర్డు.. తాజాగా సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న పదో తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుంది. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయ్యాక.. తప్పనిసరిగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఆ జాబితా ఆధారంగా విద్యార్ధులు అడ్మిషన్లు పొందొచ్చు.
టీజీ పీఈసెట్ 2024 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. టీజీ పీఈసెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తికాగా.. సెకండ్, ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ తేదీల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. వెబ్ ఆప్షన్లకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 3వ తేదీన ప్రకటిస్తారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్‌కు అవకాశం ఇస్తారు. సెప్టెంబర్ 8న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్‌మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని సీట్లు పొందిన కాలేజీల్లో సెప్టెంబర్ 9 నుంచి 12వ తేదీలోపు రిపోర్టు చేయాలి.
తెలంగాణలో ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం
తెలంగాణ ఈఏపీసెట్)2024 ఉత్తీర్ణత కాకున్నా స్పాట్ అడ్మిషన్ల ద్వారా బీటెక్ కోర్సుల్లో చేరేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు/ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో మిగిలిన సీట్లకు ప్రవేశాలు కల్పిస్తు్న్నారు. మొదట కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈఏపీసెట్‌లో ఉత్తీర్ణత కానివారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. మొత్తం రుసుము అభ్యర్థులే చెల్లించుకోవాలి. హైదరాబాద్ జేఎన్‌టీయూ, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల, కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు, ప్రైవేటు కాలేజీల్లో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.