TS INTER: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Telangana Inter Supplementary Exams: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
Telangana Inter Supplementary Exams: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇక ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణులు కాని వారికి జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు జులై 22న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ , జులై 23న ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు నెలాఖరులో కెల్లా ఈ ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది..
ఫస్ట్ ఇయర్ షెడ్యూల్
*ఆగస్ట్ 1న సెకండ్ లాంగ్వేజ్ పేపర్1
*ఆగస్ట్ 2న ఇంగ్లిష్ పేపర్ 1
*ఆగస్ట్ 3న మ్యాథ్స్ పేపర్ 1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1,
*ఆగస్ట్ 4న మాథ్స్ పేపర్1B, జూవాలజీ పేపర్1 ,హిస్టరీ పేపర్1
*ఆగస్ట్ 5న ఫిజిక్స్ పేపర్1, ఎకనామిక్స్ పేపర్1
*ఆగస్ట్ 6న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్1
సెకండ్ ఇయర్ షెడ్యూల్
*ఆగస్ట్ 1న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
*ఆగస్ట్ 2న ఇంగ్లిష్ పేపర్2
*ఆగస్ట్ 3న మాథ్స్ పేపర్ 2A, బొటనీ పేపర్2, పొలిటికల్ సైన్స్ పేపర్2
*ఆగస్ట్ 4న మాథ్స్ పేపర్2B, జూవాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్2
*ఆగస్ట్ 5న ఫిజిక్స్ పేపర్2, ఎకనామిక్స్ పేపర్2
*ఆగస్ట్ 6న కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..