AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter Exams 2025: మర్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. నిమిషం నిబంధనపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన

తెలంగాణలో మార్చి 5 అంటే బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల 96 వేల 971 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 4,88,448 మంది, సెకెండ్ ఇయర్ లో 5,08,523 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ కు హాజరు కానున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేయగా అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 242 కేంద్రాలు సిద్ధం చేశారు.

TG Inter Exams 2025: మర్చి 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు.. నిమిషం నిబంధనపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన
Inter Exams
Vidyasagar Gunti
| Edited By: Srilakshmi C|

Updated on: Mar 03, 2025 | 4:47 PM

Share

హైదరాబాద్‌, మార్చి 3: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మర్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. హాల్ టికెట్స్ లో 15 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని నిబంధన ఉన్నప్పటికి అలాంటి నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం లేదని ఆదిత్య స్పష్టం చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలు చేయడం లేదని.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలు లో ఉంటుందని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని.. ఇప్పటికే పరీక్షా పత్రాలు ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలులో ఉంటుందని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని.. ఇప్పటికే పరీక్షా పత్రాలు ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.

కాగా ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాల్లో దాదాపు 9,96,541 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్ధులు 4,88,316 ఉండగా, సెకండియర్‌ విద్యార్థులు 5,08,225 మంది ఉన్నారు. ఇప్పటికే పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల చేసిన ఇంటర్ బోర్డు వాటిపై క్యూఆర్ కోడ్‌లను కూడా ముద్రించింది. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు సులువుగా చేరుకోవడానికి క్యూఆర్ కోడ్‌ ఉపయోగపడుతుంది. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. మరోవైపు పరీక్షల కోసం 1532 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 29,992 మంది ఇన్విజిలేటర్స్, 72 ఫ్లైయింగ్ స్క్వాడ్, 124 సిట్టింగ్ స్క్వాడ్స్ పని చేయనున్నారు, పరీక్షా కేంద్రాల సమీపంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఆదివారం సాయంత్రమే నేరుగా చేరవేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 92402 05555 టోల్‌ ఫ్రీ నంబర్‌తోపాటు, జిల్లా కంట్రోల్‌ రూం ఇన్‌చార్జి నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

హమ్మయ్యా.. ఈసారి కూడా నిమిషం నిబంధన లేనట్లే..!

ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధన ఎప్పటి నుంచో అమలవుతుంది. ఈ నిబంధన కారణంగా గతంలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు త్రుటిలో అవకాశాలు చేజార్చుకున్నారు. గత ఏడాది (2024) మార్చిలో జరిగిన ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు తొలిరోజే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో సదరు విద్యార్థిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్ధి అదే రోజు ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీంతో గత ఏడాది నుంచి నిమిషం నిబంధన ఎత్తివేశారు. ఈ సారి కూడా దీనిని అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఫలితాలపై కూడా స్పందించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ… వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19 వాల్యుయేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. ఈసారి మెదక్ వరంగల్ లో కొత్తగా వాల్యుయేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఆన్ లైన్ వాల్యుయేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.