Adulteration in Cooking Oil: మీరు వంటకు వినియోగించే నూనె అసలా..? కల్తీనా? ఇలా చిటికెలో కనిపెట్టేయండి..
మార్కెట్లో ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోదు.. మీ కిచెన్‌లో వినియోగించే వంట నూనె విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నేటి కాలంలో పప్పుఉప్పుల నుంచి నూనె దాకా ప్రతీది కల్తీ మయం అవుతోంది. కల్తీ వంట నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. మరి మార్కెట్లో కొనుగోలు చేసే వంట నూనె..
Updated on: Mar 02, 2025 | 12:36 PM

నేటి కాలంలో తినే ఆహార పదార్థాలన్నీ కల్తీ మయం అవుతున్నాయి. అందువల్ల మార్కెట్లో ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోదు.. మీ కిచెన్‌లో వినియోగించే వంట నూనె విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నూనె కూడా కల్తీ అవుతోంది. కల్తీ వంట నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. మరి మార్కెట్లో కొనుగోలు చేసే వంట నూనె యొక్క స్వచ్ఛతను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

గాఢమైన సోడియం బైకార్బోనేట్‌ను మీరు మార్కెట్లో కొన్న వంట నూనెలో బాగా కలపాలి. ఈ ఆమ్ల ద్రావణంలో ఎరుపు రంగు కనిపిస్తే, అది కల్తీ అయినట్లు గుర్తించాలి. రంగు మారకపోతే, ఆ నూనె స్వచ్ఛమైనదని నిర్ధారించుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. అరగంట తర్వాత చూస్తే అది గట్టకట్టి ఉంటే అది స్వచ్ఛమైన నూనె అని అర్థం. అది ద్రవ రూపంలోనే ఉంటే కల్తీ అని అర్థం.

ఒక గిన్నెలో కొద్దిగా నూనె తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేయాలి. కొంత సమయం తర్వాత దాన్ని గమనించాలి. నూనె రంగు మారకపోతే అది స్వచ్ఛమైన నూనె అని అర్థం. నూనె కూడా ఎర్రగా మారితే ఆ నూనె కల్తీ అయిందని అర్థం.

తెల్లటి కాగితం మీద కొద్దిగా నూనె రాసి ఆరనివ్వాలి. మీరు వంటకు ఉపయోగించే నూనె శుభ్రంగా ఉంటే అది జిడ్డుగా ఉండటానికి బదులుగా చుట్టుపక్కల ప్రాంతానికి వ్యాపిస్తుంది. అది కల్తీ అయితే నేలకు అంటుకుంటుంది.

వంట నూనె స్వచ్ఛతను తనిఖీ చేయడానికి మరొక సులభమైన మార్గం దానిని రుచి చూడటం. కొంచెం నూనె నోట్లో వేసుకుని రుచి చూడాలి. దీనికి సహజమైన రుచి, స్వచ్ఛమైన నూనె వాసన ఉంటుంది. కల్తీ నూనె చేదుగా ఉంటుంది.




