- Telugu News Photo Gallery Cinema photos Glamor overloaded, Rakul preeth sing new glamor photos viral
గ్లామర్ ఓవర్ లోడెడ్.. అందాలతో సెగ పుట్టిస్తున్న రకుల్
గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఈ మధ్య తన వరస ఫొటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ట్రెండీ డ్రెస్‌లో మతి పొగొడుతుంది. కాగా, మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి మరి!
Updated on: Mar 02, 2025 | 11:22 AM

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

కెరీర్ స్టార్టింగ్‌లో టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ బ్యూటీ, స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

అంతే కాకుండా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీ నీ ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు, మరో వైపు తన బిజినెస్‌లలో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారు మనసు దోచేసుకుంది.

మెరూన్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో తన కైపెక్కించే చూపులతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



