డార్క్ సర్కిల్స్ సమస్యకు పరిష్కారం ఇదిగో..! ఈ ఎఫెక్టివ్ నేచురల్ టిప్స్ మీకోసమే..!
నిద్రలేమి, ఒత్తిడి, వయస్సు పెరగడం, అనారోగ్యం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలర్జీలు వంటి అనేక కారణాల వల్ల కంటి చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. వీటి వల్ల ముఖం కాంతివంతంగా కనిపించదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 02, 2025 | 5:00 PM

రోజ్ వాటర్‌లో విటమిన్ A, C లు పుష్కలంగా ఉండే కారణంగా ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీనిని కళ్లపై అప్లై చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గటమే కాకుండా కళ్ళకు చల్లదనాన్ని అందిస్తుంది. కాటన్‌లో రోజ్ వాటర్ తీసుకుని కళ్లపై ఉంచి 10 నిమిషాలు విడిచిపెట్టాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. అయితే ఇది నేరుగా అప్లై చేయకుండా కీరదోస రసం, చిటికెడు పసుపుతో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఒక స్పూన్ శనగపిండిలో కొద్దిగా పసుపు, టమాట రసం వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని కంటి చుట్టూ అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.

విటమిన్ E ఆయిల్ చర్మానికి పోషణ ఇస్తుంది. ఇది నేరుగా రాయకుండా కొబ్బరి నూనె, ఆలివ్ నూనెల్లో కలిపి వేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు చర్మం మెరుగ్గా కనిపిస్తుంది.

అందువల్ల కలుషితమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముక్కు, నోటిని కప్పుకోవడం మంచిది. కాబట్టి అంతరాలను అర్థం చేసుకోవడం ద్వారా అలెర్జీలు వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. మీకు జలుబు లేదా మరేదైనా అలెర్జీ ఉంటే ముక్కు రోజంతా కారుతూనే ఉంటుంది. ఇది చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈసమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కళ్ల చుట్టూ నల్లటి వలయాల ప్రధాన కారణాల్లో ఒకటి నిద్రలేమి. రోజూ కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ఆల్కహాల్, క్యాఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు వచ్చి డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.




