AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Hall Tickets 2024: నేడే తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామ్స్‌

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ముగిశాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఇక వార్షిక పరీక్షల కోసం విద్యార్ధులు ముమ్మరంగా సిద్ధమవుతున్నారు. ఇంటర్ హాల్‌టికెట్లు సోమవారం (ఫిబ్రవరి 19) విడుదలకానున్నాయి. టీఎస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పొందుపరుచనున్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2024 ఈ నెల 28 నుంచి..

TS Inter Hall Tickets 2024: నేడే తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామ్స్‌
TS Inter Hall Tickets 2024
Srilakshmi C
|

Updated on: Feb 19, 2024 | 7:27 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19: తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ముగిశాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఇక వార్షిక పరీక్షల కోసం విద్యార్ధులు ముమ్మరంగా సిద్ధమవుతున్నారు. ఇంటర్ హాల్‌టికెట్లు సోమవారం (ఫిబ్రవరి 19) విడుదలకానున్నాయి. టీఎస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పొందుపరుచనున్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2024 ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది పరీక్షలకు 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 19) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష నిర్వమిస్తారు. ఫిబ్రవరి 17వ తేదీన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌వాల్యూస్‌ పరీక్ష నిర్వహించారు.

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వరంగల్‌ యువకుడు

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన పలు ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగం సాధించడమే గగనమైపోతుంది. అలాంటిది వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్‌ అనే యువకుడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై అందరినీ ఆశ్చర్య పరిచాడు. సూరిపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌-అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్‌. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రంజిత్‌ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదివాడు. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్‌ ఉద్యోగం, అనంతరం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ కొలువులు సొంతం చేసుకున్నాడు.

ఇటీవల టీఎస్పీయస్సీ ప్రకటించిన గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తాజాగా శనివారం ప్రకటించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పరీక్ష ఫలితాల్లోనూ రంజిత్‌ సత్తా చాటాడు. రంజిత్‌ ప్రస్తుతం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే తాను మాత్రం, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఉద్యోగంలో చేరనున్నట్లు మీడియాకు తెలిపాడు. దీంతో ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన రంజిత్‌ను గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.