IIT Hyderabad: అద్భుత అవకాశం.. ఐఐటీ హైదరాబాద్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు..
అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్ (SURE) పేర.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులకు సమగ్ర పరిశోధన అనుభవాన్ని అందించడం, ఆవిష్కరణలు - అకడమిక్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 మందికి ఇంటర్న్‌షిప్ అందించడానికి సిద్ధంగా ఉంది..
హైదరాబాద్, ఫిబ్రవరి 19: అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్ (SURE) పేర.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులకు సమగ్ర పరిశోధన అనుభవాన్ని అందించడం, ఆవిష్కరణలు – అకడమిక్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 మందికి ఇంటర్న్‌షిప్ అందించడానికి సిద్ధంగా ఉంది. మహిళా అభ్యర్ధులకు 50 శాతం ప్రత్యేక స్లాట్‌లను అందించనుంది.
ఇంటర్న్‌షిప్ వ్యవధి
ఇంటర్న్‌షిప్ వ్యవధి 1-2 నెలలు ఉంటుంది. అంటే మే 15, 2024 నుంచి జూలై 14, 2024 వరకు మాత్రమే ఉంటుంది. వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు.
ఫెలోషిప్
రెండు నెలల పాటు సాగే ఈ ఇంటర్న్‌షిప్‌లో ఒక్కో ఇంటర్న్‌కు రూ.15,000ల చొప్పున చెల్లిస్తారు. ఒక నెలకు రూ. 7500, ఒకటిన్నర నెలలకు రూ. 10,000 చెల్లిస్తారు. ఒక నెల, ఒకటిన్నర నెల, పూర్తిగా రెండు నెలలు.. ఇంటర్న్‌లకు మూడు ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిల్లో దేనినైనా ఎంచుకోవచ్చు.
ఏయే అర్హతలు ఉండాలంటే..
దరఖాస్తుదారులకు ఈ క్రింది అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి..
- ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ) లేదా ఎమ్‌ఏ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి.
- 2వ/3వ సంవత్సరం BTe/BDes (అన్ని బ్రాంచ్‌లు) చదువుతున్న వారు దరఖాస్తూ చేసుకోవచ్చు.
- 3వ/4వ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ BTech, MTech ప్రోగ్రామ్ చదివే వారు
- CGPA స్కోర్ లో టాప్ 20% సాధించిన వారు అర్హులు
దరఖాస్తు సమయంలో ఇన్‌స్టిట్యూట్ హెడ్/ప్రిన్సిపాల్ ద్వారా ధృవీకరించబడిన సర్టిఫికెట్ సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్నవారు కనీసం ఒక నెలపాటు ఇంటర్న్‌గా చేయవల్సి ఉంటుంది. పార్ట్ టైమ్/ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్‌లు అనుమతించబడవు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
అప్లికేషన్ల ప్రిలిమినరీ స్క్రీనింగ్, తర్వాత సంబంధిత డిపార్ట్‌మెంట్ ఎంపికలో డిపార్ట్‌మెంట్/మెంటర్ ఫ్యాకల్టీ వారీగా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అకడమిక్ పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఇంటర్న్‌ల తుది ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.