JEE Main 2024 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫెయిల్..? మరేం పర్వాలేదు సెషన్ 2కి ఈ ప్రిపరేషన్ టిప్స్ ఫాలో అవ్వండి
తొలి, మలి విడతల్లో బెస్ట్ పర్ఫామెన్స్ మార్కులను జేఈఈ అడ్వాన్స్‌కు పరిగణనలోకి తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. తొలివిడతలో విజయం సాధించలేనివారు మలి విడతలో మరొకసారి దరఖాస్తు చేసుకుని, సత్తా చాటేందుకు అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్స్‌కు ఎలా ప్రిపేరవ్వాలో తెలిస్తే సగం విజయం సాధించినట్లే. ఈ కింది టిప్స్ ఫాలో అయ్యారంటే మలి విడతలో మీరూ టాపర్‌గా నిలవచ్చు..
న్యూడిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో (బీఈ/బీటెక్/బీఆర్క్) ప్రవేశం కోసం జేఈఈ మెయిన్ 2024 తొలి విడత (సెషన్-1) పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 13 విడుదలయ్యాయి. పేపర్-1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం పర్సంటైల్ సాధించారు. అయితే కొంత మంది ఉత్తమ ప్రతిభ కనబరచలేకపోయారు. అటువంటి వారికి మరో అవకాశం ఇచ్చింది ఎన్‌టీఏ. 2024 ఏప్రిల్‌లో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షల్లో మళ్లీ అవకాశం కల్పించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి, మలి విడతల్లో బెస్ట్ పర్ఫామెన్స్ మార్కులను జేఈఈ అడ్వాన్స్‌కు పరిగణనలోకి తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. తొలివిడతలో విజయం సాధించలేనివారు మలి విడతలో మరొకసారి దరఖాస్తు చేసుకుని, సత్తా చాటేందుకు అవకాశం ఉంటుంది. జేఈఈ మెయిన్స్‌కు ఎలా ప్రిపేరవ్వాలో తెలిస్తే సగం విజయం సాధించినట్లే. ఈ కింది టిప్స్ ఫాలో అయ్యారంటే మలి విడతలో మీరూ టాపర్‌గా నిలవచ్చు..
JEE మెయిన్ దేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలో ఒకటి. ప్రిపరేషన్ వ్యూహాత్మకంగా, సమర్థవంతంగా సాగితేనే ఇందులో విజయం సాధ్యమవుతుంది. JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షలో మెరుగ్గా ఫలితాలు సాధించాలంటే పూర్తి స్థాయి సన్నాహాలను ప్రారంభించాలి. JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. సన్నాహాలకు దాదాపు 50 రోజుల సమయం ఉంది. మంచి గ్రేడ్‌లతో పరీక్షను ఛేదించడానికి ప్రిపరేషన్‌లో మొదటి రోజు నుంచి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే..
JEE మెయిన్ 2024 సెషన్ 1 సిలబస్‌ను మరోమారు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష తయారీని ప్రారంభించడానికి ముందు మొదటిది, అతి ముఖ్యమైన దశ పూర్తి సిలబస్‌పై అవగాహన పెంపొందించుకోవడం. ఇది మీ విశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఏ టాపిక్ మిస్ కాకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే, ఇంత తక్కువ సమయంలో మొత్తం సిలబస్‌ను కవర్ చేయడం కష్టం కాబట్టి మీరు సెషన్ 1లో పూర్తి చేసిన టాపిక్‌లు కాకుండా కవర్ చేయవాల్సిన టాపిక్‌ల వివరాలను జాబితా చేయాలి.
కష్టమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి..
మీరు టాపిక్‌ల జాబితాను రూపొందించినప్పుడు 2024 సెషన్ 1లో, అలాగే గత సంవత్సరాల్లో ఏ టాపిక్‌లు ఎక్కువగా అడిగారో, ఎక్కువ వెయిటేజీ వేటికి ఇచ్చారో వంటి విషయాలపై దృష్టి సారించాలి. ముందుగా వాటిని చదవడం ప్రారంభించాలి. అలాగే సెషన్ 2 పరీక్ష ప్రిపరేషన్‌కు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మొత్తం సిలబస్‌ను కవర్ చేయడంతో పాటు ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై దృష్టి పెట్టడం చాలా కీలకం.
స్టడీ మెటీరియల్
JEE మెయిన్ 2024 సెషన్ 2 కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో ఉత్తమ స్టడీ మెటీరియల్‌ని ఎంచుకోవాలి. అభ్యర్థులు సెషన్ 1 పరీక్ష కోసం తమ వద్ద ఉన్న స్టడీ మెటీరియల్‌ను కూడా పరిగణించవచ్చు. సమర్థవంతమైన స్టడీ మెటీరియల్ మీ ప్రిపరేషన్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి తాము ఎంచుకునే స్టడీ మెటీరియల్ ఉత్తమమైనదిగా ఉండాలి.
మాక్ టెస్ట్‌లు, ప్రీవియస్ పేపర్‌లను ప్రాక్టీస్ చేయాలి
JEE మెయిన్ 2024 ప్రిపరేషన్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వీలైనన్ని మాక్ టెస్ట్‌లు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వలన ఇప్పటి వరకు ఎంత ప్రిపరేషన్ పూర్తయింది, మీరు ఏ టాపిక్‌లో వీక్‌గా ఉన్నారో ట్రాక్ చేయవచ్చు.
సందేహాలు ఉంచుకోవద్దు
ప్రిపరేషన్‌లో ఎవైనా సందేహాల ఉంటే వెంటనే వాటిని నివృతి చేసుకోవాలి. అందుకు సలహాదారులు లేదా ఉపాధ్యాయులను లేదా సహాయం కోసం ఎవరినైనా సంప్రదించడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఏ ఒక్క విషయంలోనూ వెనక్కి తగ్గకూడదు. డౌట్స్ అడగడానికి భయపడకూడదు.
టైం మేనేజ్‌మెంట్
చాలా మంది ఆశావహులు పరీక్షకు హాజరవుతున్నప్పుడు సమయాన్ని నిర్వహించడం కష్టంగా భావిస్తారు. వేగాన్ని మెరుగుపరచడానికి పూర్తి-సమయం మాక్ పరీక్షలను ప్రాక్టీస్ చేయాలి. JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష మూడు గంటలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నిర్దిష్ట సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. ఏ ఒక్క ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయకూడదు.
ఒత్తిడి ఒద్దు
ఒత్తిడికి లోనుకాకుండా జేఈఈ మెయిన్ సెషన్‌కు పూర్తి అంకితభావంతో, క్రమశిక్షణతో సిద్ధం కావడం ప్రారంభించాలి. అప్పుడే మెదడు ఫ్రీగా మారి మీరు చదివే అంశాలు బుర్రకు ఎక్కుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.