TS JA Exam Postponed: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల మూడో బ్యాచ్ పరీక్ష వాయిదా.. త్వరలో కొత్త తేదీ ప్రకటన
తెలంగాణ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి బ్యాచ్3కి నిర్వహించవల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కర్మన్‌ఘాట్‌లోని అయాన్ డిజిటల్ కేంద్రం, సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలోని కేంద్రంలోనూ..
తెలంగాణ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి బ్యాచ్3కి నిర్వహించవల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కర్మన్‌ఘాట్‌లోని అయాన్ డిజిటల్ కేంద్రం, సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలోని కేంద్రంలోనూ మూడో బ్యాచ్ పరీక్షలను వాయిదా వేశామని, ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు త్వరలో మరోసారి నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా ఏప్రిల్ 3న మల్లాపూర్‌లోని అయాన్ డిజిటల్ జోన్-1, 2లలో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా దాదాపు 2 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొదటి బ్యాచ్‌కు ఉదయం 8.30-10.30 గంటల వరకు, రెండో బ్యాచ్‌కు మధ్యాహ్నం 12.30-2.30 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
ఐతే మూడో బ్యాచ్‌కు సాయంత్రం 4.45-6.45 గంటల వరకు పరీక్ష రాయాల్సి ఉంది. వారంతా నిర్ణీత సమయానికే తమకు కేటాయించిన కంప్యూటర్ల వద్ద పరీక్ష రాసేందుకు సిద్ధంగానే ఉన్నా కంప్యూటర్లలో సాంకేతిక లోపం తలెత్తి లాగిన్ అవడానికి సాధ్యపడలేదు. సాంకేతిక సమస్య ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో అభ్యర్ధులు ఆందోళనకు గురయ్యారు. ఆగ్రహానికి గురైన వందలాది మంది అభ్యర్ధులు మల్లాపూర్-నాచారం ప్రధాన రహదారిపైకి చేరుకుని రాత్రి 7.30 వరకు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడో బ్యాచ్ పరీక్ష వాయిదా వేశామని, ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు పోలీసులు, అధికారులు సముదాయించడంతో వెనుదిరిగారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.